Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెపాక్‌లో ధోని vs కోహ్లీ: ఐపీఎల్ 2019 ఆరంభం అదిరేనా?, ఆసక్తిగా ఫ్యాన్స్

IPL 2019: Teams players list timings tickets and complete squads details

హైదరాబాద్: క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీమియిర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్ మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఎప్పటిలాగే... స్టేడియం పైకప్పు తాకే సిక్సర్లు.. వికెట్లను గాల్లోకి గీరాటేసే యార్కర్లు.. ఒక్కటా.. రెండా.. ఎన్నెన్నో? దాదాపు నెలన్నరపాటు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ 12వ సీజన్ సిద్ధమైంది. శనివారం నుంచే ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌లు మొదలుకాబోతున్నాయి. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమానులు

ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమానులు

ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 23న చెన్నైలో చెన్నై, బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ 12వ సీజన్‌ మొదలవుతుంది.ఈ మ్యాచ్‌కి చెపాక్‌లోని ఎమ్.ఎ చిదంబరం స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఐపీఎల్‌ 2019 సీజన్‌లో మొత్తం 8 జట్లు పోటీపడుతుండగా ప్రతి జట్టూ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడనుంది.

మార్చి 23 నుంచి మే 5 వరకూ లీగ్ దశ

మార్చి 23 నుంచి మే 5 వరకూ లీగ్ దశ

ఇందులో 7 మ్యాచ్‌లను సొంతగడ్డపై.. మరో 7 మ్యాచ్‌ల్ని ప్రత్యర్థి జట్టు వేదికల్లో ఆడతాయి. మార్చి 23 ఆరంభమై లీగ దశ మే 5 వరకూ కొనసాగనుంది. ఇందులో మొత్తం 56 మ్యాచ్‌లు ఉన్నాయి. అయితే.. క్వాలిఫయర్స్, ఎలిమినేటర్, ఫైనల్‌ మ్యాచ్‌ల తేదీలు, వేదికల్ని మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. ఎప్పటిలాగే మ్యాచ్‌లు సాయంత్రం 4 గంటలకి, రాత్రి 8గంటలకి ప్రారంభంకానున్నాయి.

12 మ్యాచ్‌లు సాయంత్రం నాలుగు గంటలకు

12 మ్యాచ్‌లు సాయంత్రం నాలుగు గంటలకు

12 మ్యాచ్‌లు సాయంత్రం నాలుగు గంటలకు

ఆరంభమవుతాయి. ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారం ఏదైనా వేదికలో ఏవైనా అనుకోని కారణాల వల్ల మ్యాచ్‌ నిర్వహణ కష్టంగా మారితే ప్రత్యామ్నాయ వేదికగా వైజాగ్‌ను నిర్వాహకులు ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 11 సీజన్లు పూర్తవగా.. చెన్నై, ముంబయి జట్లు మూడు సార్లు విజేతగా నిలిచాయి.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విరాట్ కోహ్లీ

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విరాట్ కోహ్లీ

ఇక, కోల్‌కతా రెండు సార్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్, డక్కన్ ఛార్జర్స్, రాజస్థాన్ రాయల్స్ ఒక్కోసారి టైటిల్‌ను గెలిచాయి. బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్ జట్లు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయాయి. దీంతో విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు.

ఐపీఎల్‌లో పోటీపడుతున్న జట్లు

ఐపీఎల్‌లో పోటీపడుతున్న జట్లు

1. చెన్నై సూపర్ కింగ్స్

2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

3. సన్‌రైజర్స్ హైదరాబాద్

4. ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరు మార్చుకుంది)

5. కింగ్స్ ఎలెవన్ పంజాబ్

6. రాజస్థాన్ రాయల్స్

7. కోల్‌కతా నైట్‌రైడర్స్

8. ముంబయి ఇండియన్స్

హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లివే...:

హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లివే...:

మార్చి 29 : రాజస్థాన్‌తో (రాత్రి 8)

మార్చి 31 : బెంగళూరుతో (సాయంత్రం 4)

ఏప్రిల్‌ 6 : ముంబైతో (రాత్రి 8)

ఏప్రిల్‌ 14 : ఢిల్లీతో (రాత్రి 8)

ఏప్రిల్‌ 17 : చెన్నైతో (రాత్రి 8)

ఏప్రిల్‌ 21 : కోల్‌కతాతో (సాయంత్రం 4)

ఏప్రిల్‌ 29 : పంజాబ్‌తో (రాత్రి 8)

గత విజేతలు:

గత విజేతలు:

2018 - చెన్నై సూపర్ కింగ్స్

2017 - ముంబై ఇండియన్స్

2016 - సన్ రైజర్స్ హైదరాబాద్

2015 - ముంబై ఇండియన్స్

2014 - కోల్‌కతా నైట్ రైడర్స్

2013 - ముంబై ఇండియన్స్

2012 - కోల్‌కతా నైట్ రైడర్స్

2011 - చెన్నై సూపర్ కింగ్స్

2010 - చెన్నై సూపర్ కింగ్స్

2009 - డెక్కన్ ఛార్జర్స్

2008 - రాజస్థాన్ రాయల్స్

Story first published: Friday, March 22, 2019, 17:56 [IST]
Other articles published on Mar 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+