For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీనా లేక సురేశ్ రైనానా?: 5వేల పరుగుల క్లబ్‌లో ముందెవరు?

IPL 2019 : Suresh Raina Or Virat Kohli, Who Could Reach 5000 Runs In This IPL First ? | Oneindia
IPL 2019: Suresh Raina or Virat Kohli - Who Will Become First Batsman To Score 5,000 Runs in IPL?

హైదరాబాద్: మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు తమ సొంత మైదానాల్లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ఇప్పటికే ఐపీఎల్‌కి సంబంధించిన లీగ్ దశ షెడ్యూల్‌ని బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 23 నుంచి మే 5 వరకు జరిగే లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో నమోదయ్యే రికార్డులను ఒక్కసారి పరిశీలిస్తే..

ఐపీఎల్‌లో 5000 పరుగులు

ఐపీఎల్‌లో 5000 పరుగులు

ఈ సీజన్‌తో సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరనున్నారు. మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై vs ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరేందుకు సురేశ్ రైనా 15 పరుగులు, విరాట్ కోహ్లీ 52 పరుగులు దూరంలో ఉన్నారు. చెన్నై టాస్ గెలిచి రైనా 15 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 5000 పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా సురేశ్ రైనా నిలుస్తాడు. అలా కాకుండా ఆర్సీబీ టాస్ గెలిచి కోహ్లీ 52 పరుగులు చేస్తే కోహ్లీ ఈ ఘనత సాధిస్తాడు.

అత్యధిక క్యాచ్‌లు

అత్యధిక క్యాచ్‌లు

ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లు అందుకునేందుకు గాను సురేశ్ రైనా 5 క్యాచ్‌ల దూరంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ అజ్యింకె రహానే ఐపీఎల్‌లో 50 క్యాచ్‌ల రికార్డుని అందుకునేందుకు ఒక క్యాచ్ దూరంలో ఉన్నాడు.

కెప్టెన్సీలో ధోని, విరాట్ కోహ్లీ మైలురాళ్లు

కెప్టెన్సీలో ధోని, విరాట్ కోహ్లీ మైలురాళ్లు

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 100 విజయాలను తన ఖాతాలో వేసుకునేందుకు ధోని కేవలం 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంది. కెప్టెన్‌గా ధోని ఇప్పటివరకు 94 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 64 మ్యాచ్‌ల్లో ఓటమి, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక, విరాట్ కోహ్లీ విషయానికి వస్తే మరో 5 విజయాలను నమోదు చేస్తే కెప్టెన్‌గా 50 విజయాలను అందుకుంటాడు. కెప్టెన్‌గా కోహ్లీ ఇప్పటివరకు 45 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 48 మ్యాచ్‌ల్లో ఓటమి, రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

మొట్టమొదట 100 విజయాలను నమోదు చేసిన జట్టు

మొట్టమొదట 100 విజయాలను నమోదు చేసిన జట్టు

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు మరో రెండు విజయాలను నమోదు చేస్తే ఐపీఎల్‌లో 100 విజయాలను నమోదు చేసిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ (90 విజయాల)తో రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు 148 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్ 90 విజయాలను సాధించింది.

టీ20ల్లో కోహ్లీ 8000 పరుగులు

టీ20ల్లో కోహ్లీ 8000 పరుగులు

ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో 95 పరుగులు చేస్తే టీ20ల్లో 8000 పరుగులు క్లబ్‌లో చేరతాడు. అంతేకాదు ఈ మైలురాయిని అందుకున్న రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ అరుదైన గుర్తింపు పొందుతాడు. అంతకముందు భారత్ తరుపున సురేశ్ రైనా ఈ ఘనత సాధించాడు.

అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌గా బ్రావో

అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌గా బ్రావో

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో మరో 21 వికెట్లు తీస్తే టీ20 క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు 438 టీ20 మ్యాచ్‌లాడిన డ్వేన్ బ్రావో 479 వికెట్లు తీశాడు.

రోహిత్ శర్మ 300వ టీ20

రోహిత్ శర్మ 300వ టీ20

ఐపీఎల్‌ 2019 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆడనున్న తొలి మ్యాచ్ ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు 300వ టీ20 కావడం విశేషం. మార్చి 24న ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ని వాంఖడె స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. భారత్ తరుపున 300కు పైగా టీ20 మ్యాచ్‌లాడిన క్రికెటర్ల జాబితాలో ధోని, సురేశ్ రైనాలు ఉన్నారు.

600 సిక్సులు

600 సిక్సులు

వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్ మరో 15 సిక్సులు బాదితే టీ20ల్లో 600 సిక్సులు బాదిన రెండో క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు పొందుతాడు. ఈ జాబితాలో వెస్టిండిస్ క్రికెటర్ 907 సిక్సులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

Story first published: Thursday, March 21, 2019, 15:10 [IST]
Other articles published on Mar 21, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+