Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్వదేశానికి వార్నర్, బెయిర్ స్టో: ఐపీఎల్‌లో మిగతా మ్యాచ్‌లకు సన్‌రైజర్స్ తుది జట్టిదే!

IPL 2019: Sunrisers Hyderabad’s predicted XI after World Cup departures

హైదరాబాద్: వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో తమ సొంత దేశాలకు పయనం కావడం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తీవ్ర ప్రభావాన్ని చూపనుందా? అంటే క్రికెట్ విశ్లేషకులు అవుననే అంటున్నారు. వరల్డ్‌కప్ నేపథ్యంలో ప్లే‌ఆఫ్ మ్యాచ్‌లకు ముందే విదేశీ క్రికెటర్లు తమ సొంత దేశాలకు పయనమైన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

వరల్డ్ కప్ విధుల్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లాండ్ క్రికెటర్లు జానీ బెయిర్ స్టోలు తిరుగు పయనమయ్యారు. ఈ సీజన్‌లో వీరిద్దరూ కలిసి 900కి పైగా పరుగులు చేయడంతో పాటు సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు.

షకీబ్ స్థానంలో నబీ

షకీబ్ స్థానంలో నబీ

మరోవైపు ఆప్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ షకీబ్ ఉల్ హాసన్ సైతం బంగ్లాదేశ్‌కు తిరుగు పయనమయ్యాడు. అయితే, షకీబ్ ఉల్ హాసన్ స్థానాన్ని ఆప్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీతో భర్తీ చేయాలని భావిస్తోంది. అయితే, వార్నర్, బెయిర్ స్టో స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

10 పాయింట్లతో నాలుగో స్థానం

10 పాయింట్లతో నాలుగో స్థానం

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించి 10 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు వార్నర్, బెయిర్ స్టో తుది జట్టులో లేకపోవడంతో ఆ జట్టు ఆటతీరు మరింత తీసికట్టుగా తయారవుతుందా? సన్‌రైజర్స్ తుది జట్టు ఎలా ఉండబోతుంది అనేది సగటు ఎస్‌ఆర్‌హెచ్ అభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్న.

నిరాశ పరుస్తోన్న కేన్ విలియమ్సన్

నిరాశ పరుస్తోన్న కేన్ విలియమ్సన్

మరోవైపు సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం ఈ సీజన్‌లో పెద్దగా రాణించలేదు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. ఈ సీజన్‌ ఆరంభంలో భుజం గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన కేన్ విలియమ్సన్ ఇప్పటివరకు కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 28 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 14.

సన్‌రైజర్స్ తుది జట్టు ఎలా!

సన్‌రైజర్స్ తుది జట్టు ఎలా!

వార్నర్, బెయిర్ స్టో అందుబాటులో లేకపోవడంతో సన్‌రైజర్స్ తుది జట్టు ఎలా ఉండబోతుందో ఒక్కసారి పరిశీలిద్దాం...

1. మార్టిన్ గుప్టిల్

2. కేన్ విలియమ్సన్ (కెప్టెన్)

3. మనీష్ పాండే

4. విజయ్ శంకర్

5. వృద్ధిమాన్ సాహా్(వికెట్ కీపర్)

6. మహ్మద్ నబీ

7. యూసఫ్ పఠాన్

8. ఖలీల్ అహ్మద్

9. భువనేశ్వర్ కుమార్

10. సందీప్ శర్మ

11. రషీద్ ఖాన్

Story first published: Wednesday, April 24, 2019, 19:06 [IST]
Other articles published on Apr 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+