న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: సన్‌రైజర్స్ బంఫర్ ఆఫర్, రూ.500కే టికెట్

IPL 2019: Sunrisers Hyderabad make tempting offer to fans for first home game against RR

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా పర్యటన తుది దశకు చేరుకుంది. ఆ తర్వాత మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. ఇప్పటివరకు 11 సీజన్లు పూర్తిచేసుకున్న ఐపీఎల్ 12వ సీజన్‌ కోసం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్‌ని బీసీసీఐ విడుదల చేసింది. అయితే కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించడం విశేషం.

ధోని vs పంత్: ఓ లెజెండ్‌తో న్యూ కమర్‌ను పోల్చడం తగదు ధోని vs పంత్: ఓ లెజెండ్‌తో న్యూ కమర్‌ను పోల్చడం తగదు

తొలి రెండు వారాల షెడ్యూల్‌ మాత్రమే

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగతా షెడ్యూల్‌ను మరో నాలుగో రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఐపీఎల్ ప్రాంఛైజీలకు అధికారిక సమాచారాన్ని బీసీసీఐ ఇచ్చినట్లు సోమావరం వార్తలు వచ్చాయి.

మార్చి 23న జరిగే తొలి మ్యాచ్‌లో

మార్చి 23న జరిగే తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇక, మార్చి 29న సొంతగడ్డపై జరగనున్న తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ సందర్భంగా సన్‌రైజర్స్ యాజమాన్యం వినూత్న ప్రచారం మొదలుపెట్టింది.

టికెట్స్‌పై ఆఫర్ ప్రకటించిన సన్‌రైజర్స్

సొంతగడ్డపై జరిగే తొలి మ్యాచ్‌కి సన్‌‌రైజర్స్‌ ప్రాంఛైజీ టికెట్స్‌పై ఆఫర్ ప్రకటించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం కెపాసిటీ 25వేలు ఉండగా మార్చి 13 ఉదయం 11 గంటల నుండి టికెట్ల అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. ముందుగా టిక్కెట్ కొనుక్కున్న వారికీ రూ.500కే టిక్కెట్ అమ్ముతున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించింది.

సన్ రైజర్స్ హైదరాబాద్:

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: భువనేశ్వర్ కుమార్, డేవిడ్ వార్నర్, విలియ్సమన్, రషీద్ ఖాన్, షకీబ్ అల్ హసన్, మనీష్ పాండే దీపక్ హుడా, సిద్దార్థ్ కౌల్, శ్రీవాస్తవ్ గోస్వామి (కీపర్), ఖలీల్ అహ్మద్, యూసుఫ్ పఠాన్, బసిల్ థంపి, నటరాజన్, రికీ భుయ్, సందీప్ శర్మ, మహ్మద్ నబీ, బిల్లీ స్టాన్లేక్, విజయ్ శంకర్, షహబాజ్ ఖాన్, అభిషేక్ శర్మ‌,

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: జానీ బెయిర్ స్టో (రూ.2.2 కోట్లు), వృద్ధిమాన్ సాహా (రూ.1.2 కోట్లు), మార్టిన్ గప్టిల్ (రూ.1 కోటి)

Story first published: Wednesday, March 13, 2019, 15:35 [IST]
Other articles published on Mar 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X