For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లక్కీ అంటే సన్‌రైజర్స్‌దే!: కోల్‌కతా ఓటమితో 12 పాయింట్లతోనే ప్లేఆఫ్‌కు

IPL 2019 : Sunrisers Hyderabad 1st Team To Reach Playoffs With Only 12 Points || Oneindia Telugu
IPL 2019: Sunrisers Hyderabad 1st team to reach playoffs with only 12 points

హైదరాబాద్: ఐపీఎల్ లీగ్ దశ ముగిసింది. దీంతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరే నాలుగో జట్టు ఏదో తెలిసిపోయింది. టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడటంతో హైదరాబాద్‌ మెరుగైన రన్‌రేట్‌తో ప్లేఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఐపీఎల్‌ చరిత్రలోనే అతి తక్కువ పాయింట్లతో

ఐపీఎల్‌ చరిత్రలోనే అతి తక్కువ పాయింట్లతో

తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే అతి తక్కువ పాయింట్లతో (12) ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ఈ సీజన్‌లో మిగతా జట్లన్నీ 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఈ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై చేతిలో కోల్‌కతా ఓటమిపాలవ్వడంతో సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

12 పాయింట్లతో సమానంగా నిలిచిన మూడు జట్లు

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్లు 12 పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే, ఈ మూడు జట్లలో నెట్‌ రన్‌రేట్‌ (+0.577) విషయంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మెరుగ్గా ఉండటంతో ప్లేఆఫ్స్‌‌కు అర్హత సాధించింది. సన్‌రైజర్స్‌తో పోలిస్తే కోల్‌కతా (+0.028), పంజాబ్‌ (-0.251) రన్‌రేట్ తక్కువగా ఉంది.

18 పాయింట్లతో ముంబై అగ్రస్థానంలో

18 పాయింట్లతో ముంబై అగ్రస్థానంలో

ఇదిలా ఉంటే, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించిన ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. చెన్నై, ఢిల్లీ కూడా 18 పాయింట్ల సాధించినప్పటికీ, ముంబై నెట్‌ రన్‌రేట్‌ (+0.421) విషయంలో ముందంజలో నిలిచింది. కాగా, ఢిల్లీతో పోలిస్తే చెన్నై (+0.131) మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచింది.

IPL 2019 playoffs:

IPL 2019 playoffs:

May 7: క్వాలిఫయిర్ 1 - ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - చిదంబరం స్టేడియం, చెన్నై - 19:30 IST

May 8: ఎలిమినేటర్ - ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - ACA-VDCA Stadium, విశాఖపట్నం - 19:30 IST

May 10: క్వాలిఫయిర్ 2 - Loser of Qualifier 1 vs Winner of Eliminator - ACA-VDCA Stadium, విశాఖపట్నం - 19:30 IST

May 12: ఐపీఎల్ ఫైనల్ - ఉప్పల్ స్టేడియం - హైదరాబాద్

Story first published: Monday, May 6, 2019, 12:05 [IST]
Other articles published on May 6, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+