రాజస్థాన్ సంచలన నిర్ణయం: రహానే స్థానంలో కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్

హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్సీ నుంచి అజ్యింకె రహానేను తప్పించింది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆడబోయే మిగతా మ్యాచ్‌ల్లో రహానే స్థానంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహారిస్తాడని రాజస్థాన్ రాయల్స్ అధికారిక ప్రకటన చేసింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
"గతేడాది జట్టుని ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో కెప్టెన్‌గా రహానే పాత్ర మరువలేనిది. అయితే, ఈ సీజన్‌లో కూడా జట్టుని గాడిలో పెట్టేందుకు గాను ఫ్రాంచైజీకి కొత్త విధానం అవసరమైంది. స్టీవ్ స్మిత్ ఎప్పుడూ జట్టు నాయకత్వంలో భాగంగానే ఉన్నాడు. మరోవైపు రహానే జట్టులో కీ వాయిస్‌గానే కొనసాగుతాడు" అని యాజమాన్యం ప్రకటించింది.
జట్టులో మార్పులు చేయడం ద్వారా
"ఇలా జట్టులో మార్పులు చేయడం ద్వారా ఫలితాలు అనుకూలంగా వచ్చి పాయింట్ల పట్టికలో పైకి చేరుకుంటాం" అని రాజస్థాన్ యాజమాన్యం తన ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో ఉంది.
రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ హెడ్ మాట్లాడుతూ
రహానే మార్పుపై రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ హెడ్ జుబిన్ భారుచా మాట్లాడుతూ "రహానే ఎప్పుడూ నిజమైన రాయలే. గతేడాది కఠిన పరిస్థితుల్లో కూడా రహానే జట్టుని ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్లాడు. ఇప్పటికీ రహానే జట్టులోనే కాదు.. నాయకత్వంలో కూడా కీలక ఆటగాడే. అవసరమైతే రహానే సలహాలు స్మిత్ తీసుకుంటాడు" అని అన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న స్టీవ్ స్మిత్
"ప్రపంచం క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలలో విజయవంతమైన కెప్టెన్లలో స్టీవ్ స్మిత్ ఒకడు. మాకు గట్టి నమ్మకం ఉంది అతడి సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ విజయాలను సాధిస్తుంది" అని తెలిపారు. టోర్నీలో భాగంగా శనివారం రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications