For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శాంసన్, రషీద్ సరికొత్త రికార్డు: SRH vs RR నమోదైన గణాంకాలివే!

IPL 2019, SRH vs RR statistical highlights: Sanju Samson, Rashid Khan set records

హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ (69: 37 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులకు అసలు సిసలు టీ20 మజాను అందించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో 55 బంతుల్లోనే 10ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సంజు శాంసన్ 102 పరుగులు చేశాడు. ఓపెనర్ జోస్ బట్లర్(5) ఔటవగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ మరో ఓపెనర్ అజింక్య రహానే (70: 49 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) కలిసి రెండో వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఈ సీజన్‌లో తొలి సెంచరీని నమోదు చేసిన సంజూ శాంసన్

ఈ సీజన్‌లో తొలి సెంచరీని నమోదు చేసిన సంజూ శాంసన్

జట్టు స్కోరు 134 వద్ద రహానే ఔటయ్యాడు. ఈ క్రమంలో సంజు శాంసన్ ఐపీఎల్ 2019 సీజన్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్‌స్టోక్స్ (16 నాటౌట్: 9 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సన్‌రైజర్స్ అగ్రశ్రేణి బౌలర్‌ భువనేశ్వర్ కుమార్‌ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా 6, 4, 4, 2, 4, 4 బాదేశాడు.

5 ఓవర్లలో 76 పరుగుల్ని రాబట్టిన రాజస్థాన్ రాయల్స్

5 ఓవర్లలో 76 పరుగుల్ని రాబట్టిన రాజస్థాన్ రాయల్స్

మొత్తంగా చివరి 5 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 76 పరుగుల్ని రాబట్టగలిగింది. దీంతో చివరికి సన్‌రైజర్స్‌ ముందు 199 పరుగులు భారీ లక్ష్యం ఉంచారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టును వార్నర్‌(69), బెయిర్‌స్టో(45) రాణించడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకొని హైదరాబాద్‌ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌ గణాంకాలు పరిశీలిస్తే..:

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేధించిన అత్యధిక పరుగులివే. అంతకముందు రాజస్థాన్‌పై 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇదివరకు గత సీజన్‌లో ఢిల్లీపై 188 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఒకటి కన్నా ఎక్కువ సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగోస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో సంజు శాంసన్... విరాట్‌కోహ్లీ(4), వీరేందర్‌ సెహ్వాగ్‌(2), మురళీ విజయ్‌(2) సరసన చేరాడు.

రషీద్ ఖాన్ అరుదైన రికార్డు

ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌.. జోస్‌ బట్లర్‌ వికెట్‌ తీయడంలో ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో బట్లర్‌ అత్యధికంగా మూడుసార్లు అతడి బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజ్యింకే రహానే, సంజూ శాంసన్‌ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 119 పరుగులు చేశారు. రాజస్థాన్‌ తరఫున రెండో వికెట్‌కు ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం.

ఈ సీజన్‌లో భువనేశ్వర్ కుమార్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో 55 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. కాగా 2016లో బెంగళూరుపై 55 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ని లక్ష్యంగా చేసుకుని హిట్టింగ్ చేసిన సంజు శాంసన్.. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో 6, 4, 4, 2, 4, 4తో 24 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత 20వ ఓవర్‌లోనూ వరుసగా 4, 1, 4, 2, 2Wd, 4, 4 రూపంలో 21 పరుగులు రాబట్టింది.

Story first published: Saturday, March 30, 2019, 16:44 [IST]
Other articles published on Mar 30, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+