
హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతగడ్డపై తొలి మ్యాచ్‌కి సిద్ధమైంది. టోర్నీలో భాగంగా శుక్రవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజ్యింకె రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
సొంత ప్రేక్షకుల మధ్య మ్యాచ్ జరుగనుండటంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫేవరెట్‌గా కనబడుతోంది. గాయం కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కి దూరమైన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. గత మ్యాచ్‌లో విలియమ‍్సన్ ఆడకపోవడంతో భువనేశ్వర్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
మరొకవైపు రాజస్థాన్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై ఆడుతున్న తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించి లీగ్‌లో బోణీ కొట్టాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ (85) హాఫ్ సెంచరీ సాధించగా.. విజయ్ శంకర్ (40) సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 19.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కోల్‌కతా జట్టులో ఆండ్రీ రసెల్ (49 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి మ్యాచ్‌ని దూరం చేశాడు. గత మ్యాచ్‌లో బౌలింగ్ వైఫల్యంతోనే హైదరాబాద్ మ్యాచ్‌ను చేజార్చుకుంది. ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ సహా సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ అందరు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
ఈ మ్యాచ్‌లో భువీ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో పరుగుల్ని కట్టడి చేసి ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశిస్తోంది. ఇక, రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే... ఈ సీజన్‌లో ఆ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. జైపూర్ వేదికగా పంజాబ్‌తో ఆడిన రాజస్థాన్ రాయల్స్ బట్లర్ 'మన్కడింగ్' రనౌట్ కారణంగా ఒత్తిడికి గురై బోల్తా కొట్టింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఛేదనలో జోస్ బట్లర్ (69) రాణించడంతో ఒకానొక దశలో రాజస్థాన్ విజయం సాధించేలా కనిపించింది. జోస్ బట్లర్ ఔట్ కావడంతో చివరకు రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన స్మిత్ వరల్డ్‌కప్‌కు ముందు ఈ మ్యాచ్‌లో తనను తాను పరీక్షించుకుంటున్నాడు.
జట్ల వివరాలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో ( వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), విజయ్ శంకర్, యూసఫ్ పఠాన్, మనీశ్ పాండే, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నదీమ్, సందీప్ శర్మ, సిద్ధార్థ కౌల్
రాజస్థాన్ రాయల్స్: అజింక్య రహానె (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సంజు శాంసన్, స్టీవ్‌స్మిత్, బెన్‌స్టోక్స్, రాహుల్ త్రిపాఠి, గౌతమ్, జోప్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్కత్, శ్రేయాస్ గోపాల్, ధవళ్ కులకర్ణి