Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs MI: ఉప్పల్‌‌లో సన్‌రైజర్స్ విజయ లక్ష్యం 137

Pollard

హైదరాబాద్: కీరన్ పొలార్డ్ 26 బంతుల్లో 46 (2 ఫోర్లు, 4 సిక్సులు)లో చెలరేగడంతో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కు 137 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ముంబై ఓపెనర్లు రోహిత్‌శర్మ(11), క్వింటన్‌ డికాక్‌ (19)లు తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. మహ్మద్ నబీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ 4వ బంతికి రోహిత్ శర్మ(11) దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత సందీప్ వేసిన 5వ ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్(7) ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు.

1
45895

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా(6), హార్థిక్ పాండ్యా(14), రాహుల్ చాహర్(10)లు స్వల్పస్కోర్‌లకే పెవిలియన్ చేరారు. చివర్లో పొలార్డ్ 26 బంతుల్లో 46 (2 ఫోర్లు, 4 సిక్సులు)లో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 136 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సిద్ధార్థ్‌ కౌల్‌ రెండు, భువీ, సందీప్‌శర్మ, నబీ, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో ఆడిన యువరాజ్ సింగ్, లసిత్ మలింగల స్థానంలో అల్జారి జోసెఫ్‌, ఇషాన్‌ కిషన్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

కాగా, సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో విజయం సాధించాలని సన్‌రైజర్స్ గట్టి పట్టుదలతో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట ఓడి... రెండింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

జట్ల వివరాలు:
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:
భువనేశ్వర్‌ కుమార్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో(వికెట్‌ కీపర్‌), విజయ్‌ శంకర్‌, మనీశ్‌పాండే, దీపక్‌ హుడా, మహమ్మద్‌ నబీ, రషీద్ ఖాన్, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్ కౌల్‌.

ముంబై ఇండియన్స్:
క్వింటన్ డీకాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, బెహ్రాన్ డార్ఫ్, రాహుల్ చాహర్, అల్జారి జోసెఫ్‌, జస్ప్రీత్ బుమ్రా

Story first published: Saturday, April 6, 2019, 22:12 [IST]
Other articles published on Apr 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+