
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో ఆడిన యువరాజ్ సింగ్, లసిత్ మలింగల స్థానంలో అల్జారి జోసెఫ్, ఇషాన్ కిషన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. కాగా, సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో విజయం సాధించాలని సన్‌రైజర్స్ గట్టి పట్టుదలతో ఉంది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట ఓడి... రెండింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.
జట్ల వివరాలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), విజయ్ శంకర్, మనీశ్‌పాండే, దీపక్ హుడా, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్.
ముంబై ఇండియన్స్:
క్వింటన్ డీకాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, బెహ్రాన్ డార్ఫ్, రాహుల్ చాహర్, అల్జారి జోసెఫ్, జస్ప్రీత్ బుమ్రా