Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పంజాబ్‌తో సన్‌రైజర్స్‌ పోరు.. ఇరుజట్లకు చావోరేవో

IPL 2019 : Sunrisers Hyderabad VS Kings XI Punjab Match Preview || Oneindia Telugu
IPL 2019, SRH vs KXIP Preview: Sunrisers Hyderabad bank on home comfort against Punjab

సోమవారం ఉప్పల్‌ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్‌-12లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఇరు జట్లకు ఇంకా మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రెండు జట్లకు ప్లేఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

వార్నర్‌కు చివరి మ్యాచ్‌:

వార్నర్‌కు చివరి మ్యాచ్‌:

సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో జంట బలం. ఈ జంట పరుగులు చేయడంతోనే ఐదు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ విజయాలను అందుకుంది. అయితే ఇప్పటికే ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికైన బెయిర్‌స్టో జట్టును వీడగా.. వార్నర్‌కు ఈ మ్యాచే చివరిది. కీలక మ్యాచ్‌ ముందు బెయిర్‌స్టో జట్టును వీడడం సన్‌రైజర్స్‌కు పెద్ద లోటు. చివరి మ్యాచ్‌లో వార్నర్ చెలరేగి ఆడి జట్టుకు విజయాన్ని అందించాలని సన్‌రైజర్స్‌ భావిస్తోంది.

మిడిలార్డర్‌ వైఫల్యం:

మిడిలార్డర్‌ వైఫల్యం:

సన్‌రైజర్స్‌ను మిడిలార్డర్‌ వైఫల్యం వెంటాడుతోంది. విజయ్‌ శంకర్, దీపక్‌ హుడా, పఠాన్ బ్యాట్‌ ఝళిపించలేకపోతున్నారు. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో అద్భుత ఇన్నింగ్స్‌తో మనీశ్‌ పాండే ఆకట్టుకున్నాడు. ఇది రైజర్స్‌కు కలిసొచ్చే అంశం. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, షకీబుల్‌ హసన్‌ కూడా రాణించాల్సిన అవసరం ఉంది. మరోవైపు నబీ, రషీద్‌ ఖాన్, భువనేశ్వర్, సందీప్‌ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్‌ కౌల్‌తో కూడిన పటిష్ట బౌలింగ్‌ ఉంది. అయితే వీరు అంచనాలను అందుకోలేకపోతున్నారు. ఇక డెత్‌ ఓవర్లలోనూ తడబడుతున్నారు. ఈ సమస్యను అధిగమిస్తే సన్‌రైజర్స్‌కు తిరుగుండదు.

ఫామ్‌లో గేల్‌, రాహుల్:

ఫామ్‌లో గేల్‌, రాహుల్:

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు కూడా టాపార్డరే కీలకం. విండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్‌ గేల్‌, కేఎల్‌ రాహుల్‌లు ఆ జట్టుకు పరుగులు చేస్తున్నారు. అనంతరం మయాంక్‌ అగర్వాల్‌, డేవిడ్‌ మిల్లర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌లతో బలమైన బ్యాటింగ్ ఉంది. గత మ్యాచ్‌లో యువ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ కూడా ఫామ్ అందుకున్నాడు. వీరందరూ చెలరేగితే పంజాబ్‌ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. కెప్టెన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి బౌలింగ్‌లో ప్రధానాయుధాలు. వీరికి తోడు విల్జోన్‌, మురుగన్‌ అశ్విన్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌లు కూడా ఉన్నారు.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:

విలియమ్సన్‌ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్‌, మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్‌, షకీబల్‌ హసన్‌, దీపక్ హుడా, వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), రషీద్‌ ఖాన్, భువనేశ్వర్‌ కుమార్, సిద్ధార్థ్‌ కౌల్‌, ఖలీల్‌ అహ్మద్‌.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌:

అశ్విన్‌ (కెప్టెన్‌), క్రిస్ గేల్‌, కేఎల్ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్, డేవిడ్ మిల్లర్‌, నికోలస్‌ పూరన్‌ (వికెట్‌ కీపర్‌), మన్‌దీప్‌ సింగ్‌, విల్జోన్‌, మురుగన్‌ అశ్విన్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, మొహమ్మద్ షమి.

Story first published: Monday, April 29, 2019, 17:02 [IST]
Other articles published on Apr 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+