Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాస్ నెగ్గిన పంజాబ్: వార్నర్‌కి చివరి మ్యాచ్, అభిమానులతో కిక్కిరిసిన ఉప్పల్ స్టేడియం

IPL 2019: SRH vs KXIP, Live Score: Kings XI Punjab win the toss and elect to field

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్‌కు ఇదే చివరి గేమ్ కావడంతో సన్‌రైజర్స్ అభిమానులతో ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది. సన్‌రైజర్స్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. అభిషేక్, మహ్మద్ నబీ, సందీప్‌లను తుది జట్టులో చోటు దక్కింది. పంజాబ్ తరుపున ప్రభ్ సిమ్రన్ సింగ్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తుండగా, ముజీబ్‌ తిరిగి జట్టులోకి వచ్చినట్టు అశ్విన్ తెలిపాడు.

ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఈ స్టేడియంలో ఇరు జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా... ఐదు సార్లు సన్‌రైజర్స్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ ఒక వికెట్ తీస్తే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 50 వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. కాగా, మ్యాచ్‌కి ముందు డేవిడ్ మిల్లర్ చేతుల మీదుగా ప్రభ సిమ్రన్ సింగ్ పంజాబ్ క్యాప్‌ని అందుకున్నాడు.

ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్లు పదకొండు మ్యాచ్‌లాడి చెరో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుగైన రన్‌రేట్‌ని కలిగి ఉండటంతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా... పంజాబ్ మాత్రం ఆరో స్థానంలో కొనసాగుతుంది. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

1
45924

జట్ల వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్
మహ్మద్ నబీ, యూసఫ్ పఠాన్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), విజయ్ శంకర్, సందీప్ శర్మ, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్
క్రిస్ గేల్, రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, మన్ధీప్ సింగ్, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, ఆండ్రూ టై, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అర్షదీప్ సింగ్, సిమ్రన్ సింగ్, మురుగన్ అశ్విన్

Story first published: Monday, April 29, 2019, 19:49 [IST]
Other articles published on Apr 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+