Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉప్పల్‌లో వార్నర్ పరుగుల వరద: పంజాబ్ విజయ లక్ష్యం 213

SRH

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 56 బంతుల్లో 81 (7 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుత ప్రదర్శన చేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌‌కు 213 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను దాటిగా ప్రారంభించింది. ఓపెనర్లు వార్నర్‌-సాహాలు చెలరేగి ఆడారు. తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించారు. సాహా(28) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే(36)తో కలిసి వార్నర్ పరుగుల వరద పారించాడు. ఈక్రమంలో ఐపీఎల్‌లో 44వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. వీరిద్దరూ 82 పరుగులు జోడించిన చేసిన తర్వాత మనీష్‌ పాండే ఔటయ్యాడు. దీంతో సన్‌రైజర్స్‌ 160 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికి వార్నర్‌ కూడా అశ్విన్ బౌలింగ్‌లో ముజీబ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఆ తరుణంలో కేన్‌ విలియమ్సన్‌-నబీల జోడీ ఇన్నింగ్స్‌ ను ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ 34 పరుగులు జోడించారు. అయితే 19 ఓవర్‌లో వీరిద్దరూ ఔట్‌ కావడంతో స్కోరులో వేగం తగ్గింది. చివరి రెండు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే రావడంతో సన్‌రైజర్స్‌ 212 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లో షమీ, అశ్విన్‌లు తలో రెండు వికెట్లు తీయగా, అర్షదీప్‌ సింగ్‌, మురుగన్‌ అశ్విన్‌లు చెరో వికెట్‌ తీశారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
అంతకముందు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్‌కు ఇదే చివరి గేమ్ కావడంతో సన్‌రైజర్స్ అభిమానులతో ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది.

సన్‌రైజర్స్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. అభిషేక్, మహ్మద్ నబీ, సందీప్‌లను తుది జట్టులో చోటు దక్కింది. పంజాబ్ తరుపున ప్రభ్ సిమ్రన్ సింగ్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తుండగా, ముజీబ్‌ తిరిగి జట్టులోకి వచ్చినట్టు అశ్విన్ తెలిపాడు.

ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఈ స్టేడియంలో ఇరు జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా... ఐదు సార్లు సన్‌రైజర్స్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ ఒక వికెట్ తీస్తే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 50 వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. కాగా, మ్యాచ్‌కి ముందు డేవిడ్ మిల్లర్ చేతుల మీదుగా ప్రభసిమ్రన్ సింగ్ పంజాబ్ క్యాప్‌ని అందుకున్నాడు.

1
45924

ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్లు పదకొండు మ్యాచ్‌లాడి చెరో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుగైన రన్‌రేట్‌ని కలిగి ఉండటంతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా... పంజాబ్ మాత్రం ఆరో స్థానంలో కొనసాగుతుంది. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

జట్ల వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్

మహ్మద్ నబీ, యూసఫ్ పఠాన్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), విజయ్ శంకర్, సందీప్ శర్మ, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్
క్రిస్ గేల్, రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, మన్ధీప్ సింగ్, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, ఆండ్రూ టై, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అర్షదీప్ సింగ్, సిమ్రన్ సింగ్, మురుగన్ అశ్విన్.

Story first published: Monday, April 29, 2019, 22:07 [IST]
Other articles published on Apr 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+