
హైదరాబాద్: ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ డుప్లెసిస్ 31 బంతుల్లో 45 (3 ఫోర్లు, 3 సిక్సులు) రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 45 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దీంతో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 133 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు డుప్లెసిస్ (45), వాట్సన్ (31) శుభారంభం అందించినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా (13), రాయుడు(25), జాదవ్(1), జడేజా(10) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్‌ఖాన్ రెండు, విజయ్‌శంకర్, షాబాజ్ నదీమ్, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై
ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ధోని లేకుండానే చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగింది. ధోనికి విశ్రాంతి కల్పించి అతడి స్థానంలో సురేశ్ రైనాకు కెప్టెన్సీ అప్పగించింది.
ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే రెండు మార్పులు చేసింది. ధోని స్థానంలో శామ్ బిల్లింగ్స్‌ని, మిచెల్ శాంట్నర్ స్థానంలో కర్న్ శర్మని తుది జట్టులోకి తీసుకుంది. ఇక సన్‌రైజర్స్ కూడా మార్పులు చేసింది. రికీ భుయ్, అభిషేక్ శర్మల స్థానంలో యుసుఫ్ పఠాన్, షాబాజ్ నదీమ్‌లను జట్టులోకి తీసుకుంది.
చివరగా 2010లో ధోని లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంటే... సీఎస్‌కే తరుపున 121 మ్యాచ్‌లు ఆడిన ధోనికి ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చారు. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ మరో 21 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరుపున 3000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు.
ఐపీఎల్‌లో ఇరు జట్లు 10 సార్లు తలపడగా సీఎస్‌కే 8-2తో మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన ఏడు మ్యాచుల్లో మూడింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక, చెన్నై విషయానికి వస్తే ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఏడింట విజయం సాధించింది.
దీంతో బుధవారం జరగనున్న మ్యాచ్ సన్‌రైజర్స్‌కి ఎంతో కీలకం కానుంది. మరోవైపు ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని సన్‌రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఒక్కసారి కూడా ఔట్ చేయలేదు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇక, సన్‌రైజర్స్ ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఇంకా ఐదు మ్యాచుల్లో విజయం సాధించాలి.
జట్ల వివరాలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్
డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, యూసప్ పఠాన్, దీపక్ హుడా, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, షాబాజ్ నదీమ్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ
చెన్నై సూపర్ కింగ్స్
షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా (కెప్టెన్), అంబటి రాయుడు, కేదార్ జాదవ్, శామ్ బిల్లింగ్స్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కర్ణ్ శర్మ, దీపక్ చాహర్, శార్ధూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్