
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడున్నాయి. ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ధోని లేకుండానే చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగుతోంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ధోనికి విశ్రాంతి కల్పించి అతడి స్థానంలో సురేశ్ రైనాకు కెప్టెన్సీ అప్పగించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే రెండు మార్పులు చేసింది. ధోని స్థానంలో శామ్ బిల్లింగ్స్‌ని, మిచెల్ శాంట్నర్ స్థానంలో కర్న్ శర్మని తుది జట్టులోకి తీసుకుంది. ఇక సన్‌రైజర్స్ కూడా మార్పులు చేసింది. రికీ భుయ్, అభిషేక్ శర్మల స్థానంలో యుసుఫ్ పఠాన్, షాబాజ్ నదీమ్‌లను జట్టులోకి తీసుకుంది.
చివరగా 2010లో ధోని లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంటే... సీఎస్‌కే తరుపున 121 మ్యాచ్‌లు ఆడిన ధోనికి ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చారు. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ మరో 21 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరుపున 3000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు.
ఐపీఎల్‌లో ఇరు జట్లు 10 సార్లు తలపడగా సీఎస్‌కే 8-2తో మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన ఏడు మ్యాచుల్లో మూడింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక, చెన్నై విషయానికి వస్తే ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఏడింట విజయం సాధించింది.
దీంతో బుధవారం జరగనున్న మ్యాచ్ సన్‌రైజర్స్‌కి ఎంతో కీలకం కానుంది. మరోవైపు ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని సన్‌రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఒక్కసారి కూడా ఔట్ చేయలేదు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇక, సన్‌రైజర్స్ ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఇంకా ఐదు మ్యాచుల్లో విజయం సాధించాలి.
జట్ల వివరాలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్
డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, యూసప్ పఠాన్, దీపక్ హుడా, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, షాబాజ్ నదీమ్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ
చెన్నై సూపర్ కింగ్స్
షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా (కెప్టెన్), అంబటి రాయుడు, కేదార్ జాదవ్, శామ్ బిల్లింగ్స్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కర్ణ్ శర్మ, దీపక్ చాహర్, శార్ధూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్