ఈ సీజన్ అద్భుతంగా సాగింది: ఆరెంజ్ ఆర్మీకి కెప్టెన్ కేన్ థాంక్స్ చెబుతూ ట్వీట్

హైదరాబాద్: ఈ సీజన్ ఎంతో అద్భుతంగా గడిచిందని, మద్దతుగా నిలిచిన సన్‌రైజర్స్ అభిమానులు(ఆరెంజ్ ఆర్మీ)కి ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2017 సీజన్‌లో తన బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు చేరువయ్యాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఆ తర్వాత 2018 సీజన్‌లో బాల్ టాంపరింగ్ ఆరోపణలతో డేవిడ్ వార్నర్ సీజన్ మొత్తానికి దూరం కావడంతో నాయకత్వం బాధ్యతలను అందుకున్నాడు. గత సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకోవడంతో పాటు సన్‌రైజర్స్‌ను ఫైనల్స్ వరకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు.

గత సీజన్‌లో రన్నరప్‌గా
వాంఖడే వేదికగా జరిగిన పైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ సీజన్‌లో మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తిరిగి జట్టులో చేరినప్పటికీ జట్టు యాజమాన్యం కేన్ విలియమ్సన్ సారథ్య బాధ్యతలపై నమ్మకం ఉంచి అతడినే కెప్టెన్‌గా కొనసాగించింది.

ఐదు మ్యాచ్‌లకు విలియమ్సన్ దూరం
భుజం గాయం కారణంగా ఈ సీజన్‌లో కేన్ విలియమ్సన్ ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ సారథ్య బాధ్యతలను అందుకున్నాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ భిన్నఫలితాలను రాబట్టింది. ఈ సీజన్‌లో విలియమ్సన్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. మొత్తం 9 మ్యాచ్‌లాడి 156 పరుగులు చేశాడు.

అత్యధిక స్కోరు 70 నాటౌట్
ఈ సీజన్‌లో విలియమ్సన్ అత్యధిక స్కోరు 70 నాటౌట్. మరోవైపు సన్‌రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టోలు మాత్రం లీగ్ ఆరంభ మ్యాచ్‌ల్లో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే, వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా ఈ ఇద్దరూ తమ సొంత దేశాలకు పయనం కావడంతో ఐపీఎల్ రెండో అర్ధభాగంలో మనీష్ పాండే ఫామ్‌లోకి వచ్చాడు.
వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా సొంత దేశానికి
న్యూజిలాండ్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కేన్ విలియమ్సన్ వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా తన సొంత దేశానికి పయనమయ్యాడు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో తమకు మద్దతుగా నిలిచిన ఆరెంజ్ ఆర్మీకి, ఆటగాళ్లకు, సపోర్టింగ్ స్టాఫ్‌కు, స్పాన్సర్లకు థ్యాంక్స్ చెపుతూ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమి
విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించి 12 పాయింట్లతో అదృష్టం కొద్దీ నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. సన్‌రైజర్స్, కోల్‌కతా, పంజాబ్ జట్లు 12 పాయింట్లతో నిలిచినా హైదరాబాద్ మెరుగైన రన్‌రేట్‌తో ప్లేఆఫ్‌కు అర్హత సాధించడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications