సీఓఏతో మాట్లాడా: పరస్పర విరుద్ధ ప్రయోజనాలేవన్న గంగూలీ


హైదరాబాద్ బీసీసీఐ క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ)ని సంప్రదించిన తర్వాతే ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2019 సీజన్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా నియమించుకుంది. ఈ మేరకు గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా
గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా ఎంపిక కావడంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తన ఎంపిక పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు రాదని దాదా వివరణ ఇచ్చాడు. గంగూలీ మాట్లాడుతూ "ఇందులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలేమీ లేవు. ఇంతకు ముందే ఐపీఎల్ పరిపాలనా మండలికి రాజీనామా చేశా" అని చెప్పాడు.

పాత్ర చేపట్టే ముందే సీఓఏను సంప్రదించా
"సలహాదారు పాత్ర చేపట్టే ముందే సీఓఏను సంప్రదించా. ఎంతో ఆసక్తిగా ఉన్నా. ఎప్పుడూ క్రికెట్‌లోకి పునరాగమనం చేయాలనే కోరుకునేవాడిని. ఇప్పుడు నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఒకప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌ని. కానీ ప్రస్తుత పాత్ర దానికి పూర్తిగా భిన్నం. డగౌట్‌లో కూర్చొని సలహాలు ఇవ్వడంతో పోలిస్తే మైదానంలో ఆడటం వేరు" అని గంగూలీ చెప్పాడు.

కెప్టెన్‌గా మైదానంలో ప్రణాళికలు
"ఒక కెప్టెన్‌గా మైదానంలో ప్రణాళికలు అమలు చేయాలి. ఇప్పుడు బాధ్యతంతా ఆటగాళ్లపైనే ఉంటుంది. గతేడాదితో పోలిస్తే ఢిల్లీ ప్రస్తుతం మరింత పటిష్టంగా ఉంది. ఢిల్లీ జట్టులో కొందరు ప్రతిభావంతమైన యువ క్రికెటర్లు ఉన్నారు" అని గంగూలీ అన్నారు. ఈ నియామకంతో సౌరవ్ గంగూలీ... ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి పని చేయనున్నారు.
గంగూలీ మాట్లాడుతూ
ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదిరినందుకు చాలా సంతోషంగా ఉంది. గత కొన్నేళ్లుగా జిందాల్స్‌తో పాటు జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ గురించి తెలుసు. ఆ గ్రూప్ తాజా స్పోర్ట్స్ వెంచర్‌లో భాగస్వామి అవడం చాలా ఆసక్తిగా ఉన్నా. ఆ జట్టులోని ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా" అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications