ఐపీఎల్ 2019: లంకపై జో రూట్ సెంచరీ, ఢిల్లీకి దాదా చేసిన సూచన ఇదే

హైదరాబాద్: శ్రీలంకతో పల్లెకెలె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో రాణించిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ని ఐపీఎల్ 2019 సీజన్ కోసం డిసెంబర్‌లో నిర్వహించే వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ దక్కించుకుంటే బాగుటుందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు.
నవంబర్ 15లోగా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అందించాలని ఐపీఎల్ నిర్వాహకులు సూచించడంతో.... కాంట్రాక్ట్ పూర్తయిన ఆటగాళ్లతో పాటు ఫామ్‌లో లేని ఆటగాళ్లందరినీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదులుకున్నాయి. ఇప్పటికే పంజాబ్ జట్టు యువరాజ్ సింగ్‌ను వదులుకోగా.. ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రాంఛైజీ గౌతమ్ గంభీర్‌ను వేలానికి విడుదల చేసింది.
జో రూట్‌ని కొనుగోలు చేయని ప్రాంఛైజీలు
గతేడాది నిర్వహించిన ఐపీఎల్ వేలంలో జో రూట్ ఉన్నప్పటికీ ఏ ప్రాంఛైజీ కూడా అతడి పట్ల ఆసక్తిని కనబర్చలేదు. అయితే, జో రూట్ ఉపఖండంలో కూడా చక్కని ఆటతీరు కబనరుస్తుండటంతో సౌరవ్ గంగూలీ తన ట్విట్టర్‌లో "జో రూట్ నుంచి అద్భుత ప్రదర్శన. టర్నింగ్ స్వ్వేర్ పిచ్‌పై అత్యుత్తమ టెస్టు సెంచరీ" అంటూ ట్వీట్ చేశాడు.

శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు
ప్రస్తుతం జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంకపై విజయం సాధించింది. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య పల్లెకెలె వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది.

తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకే ఆలౌటైన ఇంగ్లాండ్
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 290 పరుగులకే ఆలౌట్ కాగా, ఆతిథ్య శ్రీలంక జట్టు 336 పరుగులు చేసి అలౌటైంది. అనంతరం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన జో రూట్ 146 బంతుల్లో 10 పోర్లు, 2 సిక్సుల సాయంతో 124 పరుగులు చేసి జట్టుని పటిష్ట స్థితిలో నిలిపాడు.

శ్రీలంక బౌలర్లకు పరీక్షగా నిలిచిన జో రూట్
టర్నింగ్ స్వ్వేర్ పిచ్‌పై స్వీప్ షాట్లతో పాటు రివర్స్ స్వీప్ షాట్లు ఆడుతూ శ్రీలంక బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. జో రూట్ కెప్టెన్ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో సైతం ప్రశంసల వర్షం కురుస్తోంది. జో రూట్ ఇన్నింగ్స్‌ను వీక్షించిన గంగూలీ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ ప్రాంచైజీ జో రూట్‌ని కోనుగోలు చేయాలని సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications