న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫేస్‌బుక్‌లో పోస్ట్: ఆర్సీబీ అభిమాని నుంచి కామెంటేటర్‌‌కు డెత్ వార్నింగ్

IPL 2019: Simon Doull receives a death threat from the RCB fan

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో గెలుపు రుచిని చూడని జట్టు ఏదైనా ఉందంటే అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కోహ్లీ నాయకత్వంలోని ఆర్సీబీ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడగా నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఆర్సీబీ అభిమానులు నిరాశలో కూరుకుపోయారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆర్సీబీ వరుస ఓటములు

ఆర్సీబీ వరుస ఓటములు

ఈ వరుస ఓటములను తట్టుకోలేని కొందరు ఆర్సీబీ అభిమానులు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని మార్చాలంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. తాజాగా ఓ ఆర్సీబీ అభిమాని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సిమన్‌ డౌల్‌‌ని చంపుతానంటూ హెచ్చరించాడు. టోర్నీలో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

కామెంటేటర్‌ సిమన్‌ డౌల్‌‌కు వార్నింగ్

కామెంటేటర్‌ సిమన్‌ డౌల్‌‌కు వార్నింగ్

ఈ మ్యాచ్‌కి కామెంటేటర్‌గా ఉన్న సిమన్‌ డౌల్‌ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆటతీరుపై తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో తట్టుకోలేకపోయిన ఓ అభిమాని ఆర్సీబీని విమర్శిస్తే చంపుతానంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. "ఇతరుల గురించి మాట అనే ముందు ఆలోచించు. ఆర్సీబీ వారి పరాజాయాన్ని అంగీకరించింది. మళ్లీ ఎప్పుడూ ఆర్సీబీని కామెంట్‌ చేయకు. కాదని విమర్శిస్తే చచ్చిపోతావ్" అని ఆ పోస్టులో రాసుకొచ్చాడు.

ట్విట్టర్‌లో సిమన్‌ డౌల్‌ సమాధానం ఇలా

ట్విట్టర్‌లో సిమన్‌ డౌల్‌ సమాధానం ఇలా

ఆర్సీబీ అభిమాని పోస్ట్‌పై సిమన్‌ డౌల్‌ తనదైన శైలిలో స్పందించాడు. ఈ పోస్టుకు సంబంధించి స్క్రీన్‌ షాట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ "ధర్మేశ్ నాపట్ల సంతోషంగా లేడు. నేను ఏం అన్నానో గుర్తు లేదు. ఇది ఒక ఆట మాత్రమే. చిల్‌ ఔట్‌ బ్రో" అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే, ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ, ఆ ట్వీట్‌ను సిమన్ డౌల్ తొలగించాడు.

Story first published: Friday, April 5, 2019, 15:52 [IST]
Other articles published on Apr 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X