For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్.. శుబ్‌మన్‌ గిల్‌ ఫ్యూచర్‌ విరాట్‌ కోహ్లీ

IPL 2019 : Shubman Gill To Replace Virat Kohli In Future ? || Oneindia Telugu
IPL 2019: Shubman Gill take the place of Virat Kohli in the future?

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యువ బ్యాట్స్‌మన్‌ శుబ్‌మన్‌ గిల్ టీమిండియా ఫ్యూచర్‌ విరాట్‌ కోహ్లీ అని ఇప్పుడే ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కోల్‌కతా తరుపున తాజా మ్యాచ్‌లలో శుబ్‌మన్‌ అద్భుతంగా ఆడి కోల్‌కతాను విజయ తీరాలకు చేర్చుతున్నాడు. దీంతో ఇప్పుడు శుబ్‌మన్‌ స్టార్ అయ్యాడు. శుబ్‌మన్‌ ఇన్నింగ్ ముగించే తీరు చూసి అందరూ పొగుడుతున్నారు.

మొహాలి వేదికగా శుక్రవారం రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. సామ్‌ కరన్‌ (55 నాటౌట్‌; 24 బంతుల్లో 7×4, 2×6), నికోలస్‌ పూరన్‌ (48; 27 బంతుల్లో 3×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. అనంతరం లక్ష ఛేదనలో శుభ్‌మన్‌ గిల్‌ అర్ధ సెంచరీతో (65 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4, 2×6) రాణించడంతో.. లక్ష్యాన్ని కోల్‌కతా 18 ఓవర్లలోనే పూర్తి చేసింది.

ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా శుబ్‌మన్‌ తన పేరిట ఓ రికార్డును నెలకొల్పాడు. 20 ఏళ్ల లోపే ఐపీఎల్‌లో నాలుగు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధించాడు. శుబ్‌మన్‌ ఆటకు ముగ్ధులైన అభిమానులు ట్విటర్‌లో ప్రశంసల జల్లు కురిపించారు. శుబ్‌మన్‌ ఫ్యూచర్‌ విరాట్‌ కోహ్లీ అని కొందరు అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. భారత్‌ క్రికెట్‌లో గొప్ప ఆటగాడిగా అతను ఎదుగుతాడని మరికొందరు కొనియాడారు.

Story first published: Saturday, May 4, 2019, 11:32 [IST]
Other articles published on May 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+