Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా ఆట చూసేందుకు ఊరోళ్లంతా వచ్చారు: శుభ్‌మన్‌ గిల్‌

IPL 2019 : My Whole Family Was There,Can't Get Better Than This : Shubman Gill || Oneindia Telugu
IPL 2019: Shubman Gills father doing bhangra in Mohali impresses Shah Rukh Khan

తన ఆట చూసేందుకు ఊళ్ళో వాళ్లంతా వచ్చారని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యువ బ్యాట్స్‌మన్‌ శుబ్‌మన్‌ గిల్ తెలిపారు. మొహాలి వేదికగా శుక్రవారం రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం లక్ష ఛేదనలో శుభ్‌మన్‌ గిల్‌ అర్ధ సెంచరీతో (65 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4, 2×6) రాణించడంతో.. లక్ష్యాన్ని కోల్‌కతా 18 ఓవర్లలోనే పూర్తి చేసింది. గిల్ అద్భుత ప్రదర్శనకు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు లభించింది.

అవార్డు అందుకుంటున్న సమయంలో శుభ్‌మన్‌ గిల్‌ మాట్లాడుతూ... 'మ్యాచ్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. సొంత మైదానంలో విజయం ఓ గొప్ప అనుభూతి. మా అమ్మ కూడా చాలా సంతోషించారు. నేను ఆడుతున్నప్పుడు మా అమ్మానాన్న మైదానంలోనే ఉన్నారు. వాళ్లతో పాటు మా గ్రామం నుంచి చాలా మంది మ్యాచ్‌ చూసేందుకు వచ్చారు. నేను అర్ధశతకం పూర్తి చేయగానే మా నాన్న డ్యాన్స్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇది నాకు గొప్ప అనుభూతి' అని గిల్ తెలిపారు.

'ఛేదనలో భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా కీలకం. తొలుత నేను 80-100 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాను. అయితే కావాల్సిన రన్‌రేట్‌ మాత్రం ఓవర్‌కు 10కి పెరిగిపోయింది. అందుకే వేగంగా ఆడాను. క్రీజులో ఉన్నప్పుడు బ్యాటింగ్‌ మీదే దృష్టి పెడతాను. స్టాండ్స్ లో ఏం జరిగినా పట్టించుకోను. మాకు మరో మ్యాచ్‌ మిగిలే ఉంది. ఆ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాం' అని గిల్‌ చెప్పుకొచ్చారు.

Story first published: Saturday, May 4, 2019, 15:06 [IST]
Other articles published on May 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+