Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తనపై చూపిన అభిమానానికి థ్యాంక్స్ చెప్పిన వాట్సన్ (వీడియో)

IPL 2019: Shane Watson thanks fans for their love and support during the tournament

హైదరాబాద్: తనపై ఎనలేని అభిమాన్ని చూపించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వార్నర్ కృతజ్ఞతలు తెలిపాడు. ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ పైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన షేన్ వాట్సన్ చెన్నైని గెలిపించలేకపోయాడు. అంతేకాదు చెన్నైని గెలిపించేందుకు తన కాలికి రక్తం కారుతున్నా వాట్సన్ బ్యాటింగ్ కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షేన్ వాట్సన్ అంకిత భావానికి మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.

అంతేకాదు వాట్సన్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు కూడా. ఈ నేపథ్యంలో అభిమానులు తనపై చూపెట్టిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపాడు. గాయం నుంచి కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ షేన్ వాట్సన్ థ్యాంక్స్ చెప్పాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తామని తెలిపాడు.

ఈ మేరకు షేన్ వాట్సన్ ఓ వీడియోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. కాగా, దీనికి ముందు షేన్‌ వాట్సన్‌ తన కుటుంబంతో కలిసి చెన్నై నగరంలో ఆటోలో తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

Story first published: Friday, May 17, 2019, 19:16 [IST]
Other articles published on May 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+