వాట్సన్‌ను ఆడుకున్నారు: ఐపీఎల్‌లో స్లెడ్జింగ్‌కు తెరలేపిన ఢిల్లీ బౌలర్లు

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు ఇషాంత్ శర్మ, కగిసో రబాడ స్లెడ్జింగ్‌కు తెరలేపారు. ఫిరోజ్ షా కోట్లా వేదికగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్‌పై ఓవర్ల వ్యవధిలో ఇషాంత్, రబాడ వాగ్వాదానికి దిగారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అనంతరం 148 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి దూకుడుగా ఆడిన షేన్ వాట్సన్ (44: 26 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సులు) మెరుపు ఆరంభాన్నిచ్చాడు.

షార్ట్ పిచ్ బంతిని వేసిన రబాడ
కగిసో రబాడ విసిరిన ఓ షార్ట్ పిచ్ బంతిని ఫుల్ చేసేందుకు షేన్ వాట్సన్ ప్రయత్నించగా 140 కిమీ వేగంతో దూసుకొచ్చిన ఆ బంతి అతడి బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి శరీరానికి తాకింది. దీంతో నొప్పితో కాసేపు వాట్సన్ విలవిలలాడగా.. ఆ బంతిని అందుకునేందుకు అక్కడికి వెళ్లిన రబాడ.. కవ్వించే ప్రయత్నం చేశాడు.

నోటికి పనిచెప్పిన షేన్ వాట్సన్
ఆ తర్వాతి బంతికి సింగిల్ తీసి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో తన నోటికి పని చెప్పాడు. దీంతో రబాడ కూడా ధీటుగా బదులివ్వడంతో ఫీల్డ్ అంపైర్, ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ కలగజేసుకున్నాడు. అంతకముందు అంబటి రాయుడు వికెట్ తీసిన ఇషాంత్ శర్మ.. వాట్సన్‌పై కవ్వింపులకి దిగాడు. దీంతో ఘాటుగా బదులిచ్చిన వాట్సన్.. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది ఔటయ్యాడు.

సురేశ్ రైనా హ్యాట్రిక్ ఫోర్లు
ఆ తర్వాత ఇషాంత్ బౌలింగ్‌లో సురేశ్ రైనా హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. లక్ష్య ఛేదనలో షేన్ వాట్సన్‌తో పాటు ధోని (32 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. షేన్ వాట్సన్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications