భారత్‌లో జింబాబ్వే పర్యటనపై ఐపీఎల్ 2019 ఎఫెక్ట్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్‌కి ముందు భారత్‌లో పర్యటించాలని ఆశించిన జింబాబ్వే జట్టు పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై మూడు వన్డేల సిరిస్ ఆడుతున్న కోహ్లీసేన జనవరి 18న ఆ పర్యటనను ముగించుకుని న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఈ పర్యటన జనవరి 23 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 10న ముగుస్తుంది. అనంతరం కోహ్లీసేన భారత్‌కి వస్తుంది. ఆ తర్వాత వెంటనే ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13 వరకూ మళ్లీ ఆస్ట్రేలియాతో స్వదేశంలో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో
మార్చి 13 తర్వాత జింబాబ్వేతో భారత్ ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడాలని బీసీసీఐ తొలుత షెడ్యూల్‌ని రూపొందింది. అయితే, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 2019 సీజన్‌ని రెండు వారాలు ముందుకు జరిపి మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్‌ని ప్రారంభించనున్నట్లు ఇటీవలే బీసీసీఐ పాలకుల కమిటీ అధికారిక ప్రకటన చేసింది.

కేవలం 10 రోజుల వ్యవధే ఉండటంతో
దీంతో ఆసీస్ పర్యటనకు ఐపీఎల్ 2019 సీజన్‌కు మధ్య కేవలం 10 రోజుల వ్యవధే ఉండటంతో జింబాబ్వేతో సిరీస్ ఆడటం కష్టం కానుండటంతో ఆ పర్యటనని రద్దు చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. అయితే, ఇందుకు జింబాబ్వే బోర్డు అంగీకరించకపోవడంతో ఒక వన్డే, ఒక టీ20తో జింబాబ్వే పర్యటనని సరిపెట్టాలని కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

2002లో చివరిసారి ద్వైపాక్షిక సిరీస్ ఆడిన జింబాబ్వే
భారత్ గడ్డపై 2002లో చివరిసారి జింబాబ్వే ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. ఆ తర్వాత 2016లో టీ20 వరల్డ్‌కప్ కోసం భారత్‌కి వచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా మూడు వన్డేల సిరిస్ ఆడుతోంది. సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మంగళవారం ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా రెండో వన్డే జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications