న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో అరుదైన రికార్డుని నెలకొల్పిన సంజు శాంసన్

IPL 2019: Sanju Samson joins Virat Kohli, Virender Sehwag in elite list after century against Sunrisers Hyderabad

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్ సంజు శాంసన్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఒకటి కన్నా ఎక్కువ సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగోస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో సంజు శాంసన్... విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్ సరసన చేరాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 55 బంతుల్లోనే 10ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సంజు శాంసన్ 102 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అతనికిది రెండో సెంచరీ కావడం విశేషం. అంతకుముందు 2017 సీజన్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌గెయింట్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్(ప్రస్తుతం క్యాపిటల్స్) తరఫున తొలి సెంచరీ సాధించాడు.

ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు

ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు

దీంతో ఐపీఎల్‌లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లు జాబితాలో చోటు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ(4), వీరేంద్ర సెహ్వాగ్(2), మురళీ విజయ్(2) రెండు సెంచరీలతో జాబితాలో అతనికన్నా ముందున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

ఐపీఎల్‌లో శాంసన్ రెండో సెంచరీ

ఐపీఎల్‌లో శాంసన్ రెండో సెంచరీ

ఐపీఎల్‌లోనే పటిష్టమైన బౌలింగ్ లైనప్ కలిగి ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బౌలింగ్‌ని ధాటిగా ఎదుర్కొని శాంసన్‌ ఈ సెంచరీని నమోదు చేయడం విశేషం. ఓపెనర్ జోస్ బట్లర్ (5) ఆరంభంలోనే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్.. మరో ఓపెనర్ అజింక్య రహానే (70: 49 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) కలిసి రెండో వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఈ సీజన్‌లో తొలి సెంచరీ నమోదు

ఈ సీజన్‌లో తొలి సెంచరీ నమోదు

జట్టు స్కోరు 134 వద్ద రహానే ఔటయ్యాడు. ఈ క్రమంలో సంజు శాంసన్ ఐపీఎల్ 2019 సీజన్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్‌స్టోక్స్ (16 నాటౌట్: 9 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగిన సంజు శాంసన్ సెంచరీని నమోదు చేశాడు. ఐపీఎల్‌లో సంజూ శాంసన్‌కి ఇది రెండో సెంచరీ.

ఐపీఎల్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా

ఐపీఎల్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా

అంతేకాదు పిన్న వయసులో ఐపీఎల్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా సంజు శాంసన్(25 ఏళ్లు) రికార్డు సృష్టించాడు. హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ని లక్ష్యంగా చేసుకుని హిట్టింగ్ చేసిన సంజు శాంసన్.. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో 6, 4, 4, 2, 4, 4తో 24 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత 20వ ఓవర్‌లోనూ వరుసగా 4, 1, 4, 2, 2Wd, 4, 4 రూపంలో 21 పరుగులు రాబట్టింది.

5 ఓవర్లలో 76 పరుగులు

5 ఓవర్లలో 76 పరుగులు

దీంతో ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన భువీ వికెట్ లేకుండా మొత్తం 55 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా చివరి 5 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 76 పరుగుల్ని రాబట్టగలిగింది. దీంతో చివరికి సన్‌రైజర్స్‌ ముందు 199 పరుగులు భారీ లక్ష్యం ఉంచారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టును వార్నర్‌(69), బెయిర్‌స్టో(45) రాణించడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకొని హైదరాబాద్‌ విజయం సాధించింది.

Story first published: Saturday, March 30, 2019, 14:51 [IST]
Other articles published on Mar 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X