కరన్ 'హ్యాట్రిక్'.. ఐపీఎల్‌లో 18వ బౌలర్


మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ సామ్ కరన్ 'హ్యాట్రిక్' సాధించాడు. దీంతో ఐపీఎల్‌లో హ్యాట్రిక్ సాధించిన 18వ బౌలర్‌గా కరన్ రికార్డుల్లోకి ఎక్కాడు. అంతేకాదు అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న కరన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.

కరన్ హ్యాట్రిక్
ఛేదనలో ఢిల్లీ జట్టు 24 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో హిట్టర్స్ ఉన్నారు.. మరోవైపు చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. దీంతో ఢిల్లీ గెలుపుపై నమ్మకంగా ఉంది. అయితే షమీ 17వ ఓవర్లో పంత్ (39), మోరిస్ (0)లను అవుట్ చేసాడు. అనంతరం 18వ ఓవర్ చివరి బంతికి హర్షల్‌ను కరన్ ఔట్ చేసాడు. ఇక 20వ ఓవర్ తొలి రెండు బంతులకి రబడ (0), లమిచానే (0)లను క్లీన్‌బౌల్డ్ చేసి హ్యాట్రిక్ సాధించి.. పంజాబ్ జట్టుకు చిరస్మరనీయమైన విజయాన్ని అందించాడు.

అతి పిన్న వయసులో హ్యాట్రిక్
ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో (20 ఏళ్ల 302) హ్యాట్రిక్ సాధించిన ఆటగాడిగా కరన్ నిలిచాడు. మరోవైపు ఐపీఎల్ సీజన్-12లో తొలి హ్యాట్రిక్ అందుకున్న బౌలర్ కూడా సామ్ కరన్‌నే. సామ్ 2.2 ఓవర్లలో 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీసాడు. మొదటి ఓవర్ లో 9 పరుగులిచ్చిన కరన్.. అనంతరం 2 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసాడు.

ఐపీఎల్‌లో 18వ బౌలర్
ఐపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన 18వ బౌలర్‌గా కరన్ రికార్డుల్లోకి ఎక్కాడు. స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపీఎల్‌లో అత్యధిక హ్యాట్రిక్(3)లు సాధించాడు. యువరాజ్ సింగ్ 2 హ్యాట్రిక్‌లు సాధించాడు. ముఖాయ ఎంటిని, బాలాజీ, రోహిత్ శర్మ, ప్రవీణ్ కుమార్, అజిత్ చండిలా, సునీల్ నరైన్, ప్రవీణ్ తంబే, షేన్ వాట్సన్, అక్షర్ పటేల్, బద్రీ, టై, ఉనద్కట్ తలో హ్యాట్రిక్ సాధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications