Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సామ్ కరన్‌తో 'ప్రీతి జింటా' స్టెప్పులు (వీడియో)

IPL 2019 : Sam Curran Does The Bhangra With Preity Zinta After Win The Match || Oneindia Telugu
IPL 2019: Sam Curran and Preity Zinta Celebrate KXIP Win in Punjabi Style

మొహాలీ : బాలీవుడ్ నటి, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ యజమాని ప్రీతి జింటా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో మరోసారి వార్తల్లో నిలిచింది. ఉత్కంఠ పోరులో పంజాబ్ జట్టును గెలిపించిన ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌తో కలిసి ప్రీతి భాంగ్రా స్టెప్పులు వేసింది. అయితే ఇలా ప్రత్యేకంగా అభినందనలు తెలపడం ప్రీతికి ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా పంజాబ్ జట్టును గెలిపించిన వారికీ హగ్ ఇచ్చింది. తన జట్టు విజయం సాధించగానే.. మైదానంలోకి వచ్చి ఆటగాళ్లకు తనదైన రీతిలో అభినందనలు తెలపడం ప్రీతి ప్రత్యేకత.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ప్రీతి భాంగ్రా స్టెప్పులు

మ్యాచ్‌ ముగిసిన అనంతరం పంజాబ్‌ జట్టు యజమాని ప్రీతి జింటా మైదానంలోకి వచ్చి తన జట్టు ఆటగాళ్లకు అభినందనలు తెలిపింది. ఈ క్రమంలో సామ్ కరన్‌ రాగానే.. ఇద్దరూ కలిసి భాంగ్రా డాన్స్ చేశారు. డాన్స్ మొదటగా కరన్ మొదలెట్టగా.. ప్రీతీ హగ్ తో ముగించింది. ఈ వీడియోను ఐపీఎల్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇక ఆలస్యం ఎందుకు మీరూ చూసేయండి.

సోమవారం రాత్రి ఐఎస్‌ బింద్రా మైదానంలో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో పంజాబ్‌ బౌలర్ సామ్‌ కరన్‌ హ్యాట్రిక్‌ సాధించి ఢిల్లీకి ఊహించని షాక్ ఇచ్చాడు. విండీస్ స్టార్ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌ గాయంతో మ్యాచ్‌కు దూరమవడంతో.. జట్టులోకి వచ్చిన కరన్‌ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుని 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అందుకున్నాడు.

Story first published: Tuesday, April 2, 2019, 13:25 [IST]
Other articles published on Apr 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+