Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భాగస్వామ్యాలను విడదీయడంలో విఫలమయ్యాం: కేన్‌ విలియమ్సన్‌

IPL 2019, RR vs SRH: Kane Williamson reveals what cost them match against Rajasthan Royals

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు బాగా బ్యాటింగ్‌ చేసింది. వాళ్ళు వికెట్లను కాపాడుకున్నారు. వారి భాగస్వామ్యాలను విడదీయడంలో విఫలమయ్యాం అని సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తెలిపారు. సవాయ్‌ మాన్‌సింగ్‌ మైదానం వేదికగా శనివారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. దీంతో రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

తప్పుల నుండి నేర్చుకోవాలి:

తప్పుల నుండి నేర్చుకోవాలి:

మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మాట్లాడుతూ... 'ఇది చాలా కఠినమైన మ్యాచ్. మేం చేసింది మంచి స్కోరే. అయితే రాజస్థాన్‌ బాగా ఆడింది. మేము వరుసగా వికెట్లు కోల్పోయాం. కానీ రాజస్థాన్‌ వికెట్లను కాపాడుకుంటూ బాగా బ్యాటింగ్‌ చేసింది. వారి భాగస్వామ్యాలను విడదీయడంలో విఫలమయ్యాం. తప్పుల నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది' అని విలియమ్సన్‌ పేర్కొన్నారు.

మంచి ప్రదర్శన చేస్తాం:

మంచి ప్రదర్శన చేస్తాం:

'మనీశ్‌ పాండే స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడు. గత రెండు ఇన్నింగ్స్‌లో మంచి పరుగులు చేసాడు. వచ్చే మ్యాచ్‌లలో కూడా ఇదే ఫామ్‌ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. ఆరో బౌలర్‌ను తీసుకోవాలని బావిచాం. కానీ.. ఐదుగురితోనే బరిలోకి దిగాం. ఇది కలిసిరాలేదు. రాజస్థాన్ సొంత మైదానంలో మంచి పదర్శన చేసింది. మిగిలిన మ్యాచుల్లో మంచి ప్రదర్శన చేస్తాం' అని విలియమ్సన్‌ ఆశాభావం వ్యక్తం చేసాడు.

సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ విజయం:

సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ విజయం:

మొదటగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (36 బంతుల్లో 61; 9 ఫోర్లు) అర్ధ శతకం చేసాడు. రాజస్థాన్ బౌలర్లలో వరుణ్‌ ఆరోన్, థామస్, శ్రేయస్‌ గోపాల్, ఉనాద్కట్‌ తలా 2 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలిచింది. శాంసన్‌ (32 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), లివింగ్‌ స్టోన్‌ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు.

Story first published: Sunday, April 28, 2019, 15:16 [IST]
Other articles published on Apr 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+