For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs RCB: ఎప్పుడు, ఎక్కడ, లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే

IPL 2019, RR vs RCB: When And Where To Watch Live Telecast, Live Streaming

హైదరాబాద్: ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని జట్లుగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు నిలిచాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు అంచుల వరకు వచ్చి ఓడింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో 70 పరుగులకే ఆలౌటైంది. టోర్నీలోనే అత్యంత బలమైన జట్లలో ఒకటిగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 118 పరుగులతో ఓడిపోవడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఈ సీజన్‌లో ఆర్సీబీ ముఖ్యంగా అటు బౌలింగ్‌‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ అంచనాలను అందుకోలేకపోతుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే బెన్ స్టోక్స్, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ... ఆ జట్టుకు విజయాలను అందించలేకపోతున్నారు. టోర్నీలో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మంగళవారం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది.

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఆతిథ్యమిస్తోన్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌కి సంబంధించిన పూర్తి సమాచారం మీ కోసం....

RR vs RCB మ్యాచ్ ఎప్పుడు?
ఏప్రిల్ 2, 2019 (గురువారం)

RR vs RCB మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్‌

ఎన్ని గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది?
రాత్రి 8 గంటలకు

ఏ టీవీ ఛానల్‌లో మ్యాచ్‌ ప్రసారం అవుతుంది?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్

ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమింగ్
హాట్ స్టార్‌లో

Story first published: Tuesday, April 2, 2019, 17:43 [IST]
Other articles published on Apr 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+