Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జైపూర్‌లో RR vs RCB: ఆర్సీబీ బ్యాటింగ్, రాజస్థాన్ రెండు మార్పులు

IPL 2019: RR vs RCB: Live Updates: Rajasthan Royals win the toss and elect to field

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజ్యింకె రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగగా.. ఆర్సీబీ మాత్రం మూడు మార్పులతో బరిలోకి దిగింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

గాయపడిన సంజూ శాంసన్ స్థానంలో ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ, ఉనాద్కత్ స్థానంలో వరుణ్ ఆరోన్‌లకు చోటు కల్పించారు. ఇక, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆకాశ్ దీప్, నవదీప్ షైనీ, మార్కస్ స్టోయినిస్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయాయి. దీంతో ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు గెలుపు రుచిని చూడలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలనే పట్టుదలతో ఈ రెండు జట్లూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

1
45770

ఐపీఎల్ 2019 సీజన్‌లో ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి క్యాప్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐపీఎల్ తన ట్విట్టర్‌లో పంచుకుంది.

జట్ల వివరాలు:
రాజస్థాన్ రాయల్స్‌:

అజ్యింకె రహానే, జోస్ బట్లర్, రాహుల్ త్రిపాఠి, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, స్టువర్ట్ బిన్నీ, కృష్ణప్ప గౌతమ్, జోఫ్రా ఆర్చర్, గోపాల్, వరుణ్ ఆరోన్, ధావల్ కులకర్ణి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
పార్ధీవ్ పటేల్, హెట్ మెయిర్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ, ఆకాశ్ దీప్, నవదీప్ షైనీ, మార్కస్ స్టోయినిస్‌, మహమ్మద్ సిరాజ్, యజువేంద్ర చాహల్

Story first published: Tuesday, April 2, 2019, 19:53 [IST]
Other articles published on Apr 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+