For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs MI: స్మిత్ హాఫ్‌సెంచరీ, ముంబైపై రాజస్థాన్ విజయం

Smith

హైదరాబాద్: ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 162 పరుగుల విజయ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

లక్ష్యచేధనలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో రహానే(12) నిరాశపరిచినప్పటికీ... స్టీవ్ స్మిత్ 48 బంతుల్లో 59 (5 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీ, రేయాన్ పరాగ్ 29 బంతుల్లో 43(5ఫోర్లు, ఒక సిక్స్)లు బాధ్యతాయుతంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. సంజూ శాంసన్‌ 19 బంతుల్లో 35(6 ఫోర్లు, 1 సిక్సర్‌) కూడా ఫరవాలేదనిపించాడు.


రాజస్థాన్ విజయ లక్ష్యం 162
అంతకముందు ఓపెనర్ క్వింటన్ డీకాక్ 47 బంతుల్లో 65 (6 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడం టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్‌కు 162 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

1
45912

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ(5) పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ 33 బంతుల్లో34(ఫోర్, సిక్స్)తో కలిసి మరో ఓపెనర్ క్వింటన్ డీకాక్ 47 బంతుల్లో65(6 ఫోర్లు, 2 సిక్సులు) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అనంతరం జట్టు స్కోరు 108 పరుగుల వద్ద సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి డీకాక్ మరింత దూకుడుగా ఆడాడు. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత డీకాక్‌ మూడో వికెట్‌గా పెవిలియన్‌ బాటపట్టాడు. దూకుడుగా ఆడే క్రమంలో పొలార్డ్‌(10), హార్దిక్‌ పాండ్యా(23)లు తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు.

చివర్లో బెన్‌ కట్టింగ్‌ 9 బంతుల్లో 13 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో శ్రేయస్‌ గోపాల్‌ రెండు వికెట్లు తీయగా, స్టువర్ట్‌ బిన్నీ, జోఫ్రా ఆర్చర్‌, జయదేవ్ ఉనాద్కత్‌లు తలో వికెట్‌ తీశారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. జోస్ బట్లర్ స్థానంలో స్టీవ్ స్మిత్, ఇష్ సోథీ స్థానంలో బెన్ స్టోక్స్, రాహుల్ త్రిపాఠి స్థానంలో రేయాన్ పరాగ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

కాగా, ఐపీఎల్‌లో ఇకపై రాజస్థాన్ రాయల్స్ ఆడే అన్ని మ్యాచ్‌లకు రాహానే స్థానంలో కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వ్యవహారించనున్నట్లు ఆ జట్టు యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన జయంత్ యాదవ్ స్థానంలో మయాంక్ మార్కండె జట్టులోకి వచ్చాడు.

Story first published: Saturday, April 20, 2019, 20:06 [IST]
Other articles published on Apr 20, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+