కెప్టెన్ అయినా కోహ్లీతో ఆడేందుకే డివిలియర్స్ ఎదురుచూపులు

హైదరాబాద్: దేశీవాలీ టీ20లీగ్‌ల సంరంభంలో దక్షిణాఫ్రికా కూడా చేరిపోయింది. ఈ క్రమంలో నవంబరు 16న మొదలై నెలరోజుల పాటు అంటే డిసెంబరు 16వరకూ జరగనున్న ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. వాటిలో దక్షిణాప్రికా మాజీ బ్యాట్స్‌మన్ విధ్వంసకర ఆటగాడు డివిలియర్స్ ష్వనే స్పార్టాన్స్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. కానీ, డివిలియర్స్ కళ్లన్నీ ఐపీఎల్‌లో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైపుగానే ఉన్నాయట.

ఒకసారి కూడా టైటిల్‌ని గెలవలేక
ఈ క్రమంలో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఆడేందుకు తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు. సుదీర్ఘకాలంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోహ్లీతో కలిసి డివిలియర్స్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే.. వీరిద్దరూ ఆడుతున్నా ఆ జట్టు మాత్రం ఇప్పటి వరకూ ఒకసారి కూడా టైటిల్‌ని గెలవలేకపోయింది.

కోహ్లీతో కలిసి బెంగళూరు టీమ్‌కి ఆడేందుకు
ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యంత పెద్ద టీ20 టోర్నీ. రాబోయే ఏడాది కోహ్లీతో కలిసి బెంగళూరు టీమ్‌కి ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. 2018 సీజన్‌లో చేసిన తప్పిదాలను దిద్దుకుని 2019లో సత్తాచాటుతాం. ఐపీఎల్ టైటిల్ గెలిచే సత్తా బెంగళూరు జట్టుకు పుష్కలంగా ఉందనే సంగతి అందరికీ తెలుసు. టైటిల్ మాకు ఎంతో దూరంలో లేదు. తప్పకుండా 2019లో గట్టి పోటీనిస్తాం' అని ఏబీ డివిలియర్స్ ధీమా వ్యక్తం చేశాడు.

ప్రైవేట్ టీ20లపై ఎక్కువ దృష్టి
ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్.. ప్రైవేట్ టీ20లపై ఎక్కువ దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో రంగపూర్ రైడర్స్ జట్టుకు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతూనే ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో.. 2019 సీజన్‌లో బెంగళూరు టీమ్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలవనుంది.

ఐపీఎల్ 7 వారాలపాటు
దక్షిణాఫ్రికా వేదికగా 2009లో ఐపీఎల్ జరిగింది. వచ్చే ఏడాది కొన్ని కారణాల రీత్యా లీగ్‌ను యూఏఈలో కానీ, దక్షిణాఫ్రికాలో గానీ, నిర్వహించనున్నట్లు అధికారులు ఆలోచిస్తున్నారు. ఒక వేళ అది యూఏఈ అయినా మరెక్కడైనా గ్రౌండ్స్ మెన్ మైదానాన్ని చక్కగా సిద్ధం చేస్తారు. అందులో సందేహమే లేదు. ఐపీఎల్ లీగ్ ఆరంభమైనప్పటి నుంచి ఏడు వారాలపాటు మంచి వినోదాన్ని అందిస్తుందనడంలో సంకోచమే లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications