Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టంపౌట్ నుంచి తప్పించుకునేందుకు బంతిని కాలితో తన్నిన రోహిత్ (వీడియో)

Rohit

హైదరాబాద్: వాంఖడె వేదికగా రాజస్థాన్ రాయల్స్‌ జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్టంపౌట్ నుంచి తప్పించుకునేందుకు సరికొత్తగా ఆలోచించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రహానే ముంబై ఇండియన్స్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ముంబై ఇన్నింగ్స్‌లో కృష్ణప్ప గౌతమ్‌ వేసిన 10వ ఓవర్‌ ఐదో బంతికి రోహిత్‌ శర్మ స్టంపింగ్‌ కావడం ఖాయమనుకునే క్రమంలో బంతిని కాలితో అడ్డుకుని స్టంపౌట్ నుంచి తప్పించుకున్నాడు. బంతిని ఆడేందుకు ఫ్రంట్‌ ఫుట్‌కు రోహిత్ శర్మ రాగా.. దానిని గమనించిన గౌతమ్‌ బంతిని అనూహ్యాంగా లెగ్‌ సైడ్‌ వేశాడు.

1
45903

దీంతో రోహిత్‌ శర్మ తెలివిగా వ్యవహరించి బంతిని వికెట్‌ కీపర్‌ చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు కాలితో బంతిని తన్నాడు. రోహిత్‌ ఇలా ఆడటాన్ని మైదానంలో రాజస్థాన్ ఆటగాళ్లను నవ్వులు పూయించింది. అయితే, రోహిత్‌ కూడా ఈ ఘటనకు నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌ 19.3 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. జోస్‌ బట్లర్‌ 43 బంతుల్లో 87 (8 ఫోర్లు, 7 సిక్సర్లు) రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అంతకుముందు ఓపెనర్లు క్వింటన్ డీకాక్ 52 బంతుల్లో 81(6 ఫోర్లు, 4 సిక్సులు), రోహిత్ శర్మ 32 బంతుల్లో 47 (6 ఫోర్లు, సిక్స్)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది.

Story first published: Saturday, April 13, 2019, 21:24 [IST]
Other articles published on Apr 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+