For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ నిర్ణయాలతో ముంబైకి ఇబ్బంది: అనిల్ కుంబ్లే

 IPL 2019: Rohit Sharma must stick to his decision of opening for Mumbai Indians, says Anil Kumble

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో తాను ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభిస్తానని ఇటీవలే రోహిత్ శర్మ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, రోహిత్ శర్మ వ్యాఖ్యలపై ఆ జట్టు మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మండిపడ్డాడు. గత సీజన్‌లో ముంబై తరుపున ఎవిన్ లావిస్, సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్లుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించగా... రోహిత్ శర్మ మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

పూర్తి స్థాయిలో ఓపెనర్‌గా ఆడతా

పూర్తి స్థాయిలో ఓపెనర్‌గా ఆడతా

అయితే, శనివారం నుంచి ప్రారంభంకానున్న సీజన్‌లో మాత్రం పూర్తి స్థాయిలో ఓపెనర్‌గా ఆడతానని రోహిత్ శర్మ ఇటీవలే ప్రకటించాడు. "ఐపీఎల్ 2019 సీజన్‌లో నేను ఆడే అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గా ఆడాలని నిర్ణయించుకున్నాను. ఈ టోర్నీ తర్వాత ప్రపంచకప్ జరగనుండటం కూడా దీనికి ఓ కారణం. అంతేకాకుండా.. నేను ఓపెనర్‌గా అత్యుత్తమ ప్రదర్శన చేయగలుగుతున్నా" అని అన్నాడు.

రోహిత్ ఓపెనింగ్ నిర్ణయాలతో ఇబ్బంది

రోహిత్ ఓపెనింగ్ నిర్ణయాలతో ఇబ్బంది

"ఈ విషయాన్ని ఇప్పటికే జట్టుతో చర్చించాను. వారు అర్థం చేసుకున్నారు. జట్టు మిడిలార్డర్‌లో అనుభమున్న ఆటగాళ్లు ప్రస్తుతం ఉన్నారు. కాబట్టి.. ఫ్రాంఛైజీ కూడా ఇందుకు అంగీకారం తెలిపింది" అని రోహిత్ అన్నాడు. రోహిత్ శర్మ నిర్ణయంపై ముంబయి ఇండియన్స్ మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ "ముంబై ఇండియన్స్‌ జట్టు గత మూడు సీజన్లుగా రోహిత్ శర్మ ఓపెనింగ్ నిర్ణయాలతో ఇబ్బంది పడుతోంది" అని అన్నాడు.

రోహిత్ శర్మ నాలుగో స్థానంలో బ్యాటింగ్

రోహిత్ శర్మ నాలుగో స్థానంలో బ్యాటింగ్

"నేను ఆ జట్టుతో పనిచేసే సమయంలో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అది అతను తీసుకున్న నిర్ణయమే. కానీ.. ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం అతను ఓపెనర్‌గా ఆడాలని కోరుకునేది. 2018 ఐపీఎల్‌ సీజన్‌లోనూ ఇలానే జరిగింది. అతను ఓపెనర్‌గా ఆడతానని చెప్పి.. రెండు మ్యాచ్‌లు ఆడాడు" అని కుంబ్లే చెప్పుకొచ్చాడు.

మళ్లీ మిడిలార్డర్‌కి మారిపోయాడు

మళ్లీ మిడిలార్డర్‌కి మారిపోయాడు

"అయితే, ఫెయిలవడంతో.. మళ్లీ మిడిలార్డర్‌కి మారిపోయాడు. ఈ ఏడాది ఫెయిలైనా.. అతను నిర్ణయం మార్చుకోడని గ్యారంటీ లేదు. కాబట్టి.. అతను తాజా సీజన్‌లోనైనా ఓ నిర్ణయానికి కట్టుబడి ఆడితే మంచిది" అని అనిల్ కుంబ్లే తెలిపాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో వాంఖడే వేదికగా ముంబై వేదికగా తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

Story first published: Saturday, March 23, 2019, 16:23 [IST]
Other articles published on Mar 23, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+