For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: రోహిత్ శర్మకు రూ. 12 లక్షల జరిమానా

IPL 2019 : Mumbai Indians Skipper Rohit Sharma Fined For Slow Over Rate | Oneindia Telugu
 IPL 2019: Rohit Sharma fined Rs 12 lakh for MIs slow over-rate vs KXIP

హైదరాబాద్: స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్‌లో ఒక జట్టుకు జరిమానా పడటం ఇదే తొలిసారి కావడం విశేషం. శనివారం మొహాలిలోని పంజాబ్ క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఓపెనర్ క్వింటన్ డీకాక్ (60; 38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, డీకాక్‌లు ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించారు.

వీరిద్దరూ 5.2 ఓవర్లు ముగిసే సరికి 51 పరుగులు చేసిన తర్వాత రోహిత్‌ శర్మ(32) తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దూకుడుగా ఆడుతున్న సమయంలో రోహిత్‌ను విజియోన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌(11) నిరాశపరచడంతో ముంబై ఇండియన్స్‌ 62 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.

ఈ క్రమంలో డీకాక్‌-యువరాజ్‌ సింగ్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ క్రమంలో దూకుడుగా ఆడిన క్వింటన్ డీకాక్ వేగంగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ముంబై భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోన్న సమయంలో షమీ బౌలింగ్‌లో డీకాక్ ఔటయ్యాడు. డీకాక్ ఔటైన తర్వాత మరో ఆరు పరుగుల వ్యవధిలో యువీ(18) కూడా ఔటయ్యాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే పొలార్డ్ (7) కూడా పెవిలియన్‌కు చేరాడు. చివర్లో హార్దిక్‌ పాండ్యా (31, 19 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్)తో మెరుపులు మెరిపించడంతో ముంబై 170 పరుగుల మార్కును అందుకోగలిగింది. పంజాబ్ బౌలర్లలో మహ్మద్‌ షమీ, విజియోన్‌, మురుగన్‌ అశ్విన్‌ తలో రెండు వికెట్లు సాధించగా, ఆండ్రూ టై వికెట్‌ తీశాడు.

అనంతరం ముంబై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్‌ పంజాబ్‌ రెండు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే ఛేదించింది. అనంతరం చేధనకు దిగిన పంజాబ్ జట్టులో క్రిస్‌ గేల్‌(40; 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆరంభాన్నివ్వగా, కేఎల్‌ రాహుల్‌(71నాటౌట్‌; 57 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌) చివరివరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు.

Story first published: Sunday, March 31, 2019, 15:57 [IST]
Other articles published on Mar 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+