

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా దిగుతానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌శర్మ చెప్పాడు. మంగళవారం జట్టు మెంటార్ జహీర్‌ఖాన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ తాజా సీజన్‌పై తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఈ సందర్భంగా గతేడాది ఏ స్థానంలోనూ కుదురుకోకపోవడంతో ఈసారి ఓపెనింగ్ చేస్తానని రోహిత్ శర్మ ప్రకటించాడు.
యువరాజ్‌ను జట్టులోకి తీసుకున్న నేపథ్యంలో మిడిలార్డర్ మరింత బలంగా మారిందని రోహిత్ చెప్పాడు. గత మూడు నాలుగు ఐపీఎల్ సీజన్లలో సరిగ్గా ఆడని యూవీ ఈ సీజన్‌లో తమ జట్టులో కీలక ఆటగాడిగా మారుతాడని చెప్పాడు. ఈ సీజన్‌లో యువీ మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తాడని రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు.
ఇక, జహీర్ ఖామ్ మాట్లాడుతూ "ఒక్కోసారి ఆటగాళ్లు మొదటి రౌండ్‌లో అమ్ముడుపోరని, తర్వాత వారి అనుభవరీత్యా రెండో రౌండ్‌లో అమ్ముడుపోతారు. యువీ కుడా మాకు అలాగే దొరికాడు. యువీ రాకతో తమ మిడిల్‌ఆర్డర్ బలంగా మారింది" అని చెప్పాడు. గత సీజన్‌లో ముంబై ప్లే ఆఫ్ దశలోనే టోర్నీ నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
దీనిపై రోహిత్ మాట్లాడుతూ "ఈసారి మంచి ప్రదర్శన చేసేందుకు తమ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే తాను ఆటగాళ్లతో మాట్లాడడని.. వారంతా ఈసారి మంచి ప్రదర్శన చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు" అని రోహిత్ శర్మ తెలిపాడు.