For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నోబాల్‌ గొడవ.. డోర్‌ పగలగొట్టిన అంపైర్‌

IPL 2019 : Royal Challengers Bangalore Faces Another Umpiring Howler Over No-Ball || Oneindia Telugu
IPL 2019, RCB vs SRH: Umpire Nigel Llong angry on Umesh Yadav oevr No-Ball issue

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అంపైర్‌ గది డోర్‌ను ధ్వంసం చేసినందుకు ఇంగ్లాండ్ సీనియర్‌ అంపైర్‌ నిగెల్‌ లాంగ్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఈ విషయమై స్టేడియం నిర్వాహకులు బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో విచారణ జరుగుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఐపీఎల్‌ సీజన్-12 లీగ్‌ మ్యాచ్‌ల్లో భాగంగా గత శనివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది.

ఉమేశ్‌పై ఆగ్రహం:

ఉమేశ్‌పై ఆగ్రహం:

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ మొదటగా బ్యాటింగ్‌ చేస్తుండగా.. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ను బెంగళూరు పేస్ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ వేస్తున్నాడు. ఆ ఓవర్‌లోని ఓ బంతిని అంపైర్‌ నిగెల్‌ లాంగ్‌ నోబాల్‌గా ప్రకటించారు. రీప్లేలో అది సరైన డెలివరీ అని తేలడంతో.. ఉమేశ్‌తో పాటు బెంగళూరు కెప్టెన్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది నోబాల్‌ ఎలా అవుతుందని ఉమేశ్‌ ప్రశ్నించగా.. అంపైర్‌ ఆగ్రహం వ్యక్తం చేసి బౌలింగ్‌ వేయడానికి వెళ్లాలని సూచించాడు.

రూ.5వేలు చెల్లించాడు:

రూ.5వేలు చెల్లించాడు:

ఆ ఓవర్‌ అనంతరం ఇన్నింగ్స్‌ ముగిసింది. బ్రేక్‌ సమయంలో స్టేడియంలో అంపైర్లకు కేటాయించిన రూమ్‌కు ఆగ్రహంతో వెళ్లిన లాంగ్‌.. డోర్‌ను కాలితో గట్టిగా తన్ని ధ్వంసం చేశాడు. అనంతరం స్టేడియం అధికారులతో గొడవ తర్వాత లాంగ్‌ రూ.5వేలు చెల్లించాడు. అయితే తాను చెల్లించిన డబ్బులకు రషీదు ఇవ్వాలని లాంగ్‌ వాళ్లతో వాగ్వాదానికి దిగారు. డోర్‌ పగలగొట్టినందుకు లాంగ్‌ జరిమానా కట్టారని కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ సుధాకర్‌రావు తెలిపారు. లాంగ్‌పై చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు కూడా అతను పేర్కొన్నారు.

ఫైనల్‌ మ్యాచ్‌కు అంపైర్‌గా:

ఫైనల్‌ మ్యాచ్‌కు అంపైర్‌గా:

హైదరాబాద్‌ వేదికగా మే 12న జరిగే ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు నిగెల్‌ లాంగ్‌ అంపైర్‌గా వ్యవహరించనున్నారు. డోర్‌ ధ్వంసంపై బీసీసీఐ విచారణ చేస్తున్నప్పటికీ.. లాంగ్‌ను ఫైనల్‌ మ్యాచ్‌ అంపైరింగ్‌ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం లేదని తెలుస్తోంది. లాంగ్‌ ఇప్పటి వరకు 56 టెస్టులు, 123 వన్డేలు, 32 టీ20లకు అంపైర్‌గా వ్యవహరించారు. ఇక త్వరలో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌లో కూడా అంపైర్‌గా వ్యవహరించనున్నారు. మరి బీసీసీఐ లాంగ్‌పై చర్యలు తీసుకుంటుందా? లేదో? చూడాలి.

Story first published: Tuesday, May 7, 2019, 13:38 [IST]
Other articles published on May 7, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+