IPL 2019: RCB vs RR - హెడ్ టు హెడ్ రికార్డు, గణాంకాలివే!

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండోసారి తలపడుతున్నాయి. చివరగా ఈ రెండు జట్లు ఆడిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ సీజన్‌లో ఇప్పటివరకు రాజస్థాన్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.... ఆర్సీబీ మాత్రం 8 పాయింట్లతో పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. టెక్నికల్‌గా చెప్పాలంటే ఆర్సీబీ ప్లేఆఫ్ మ్యాచ్‌లకు దూరమైనట్టే. అయితే, మిగతా జట్ల ఓటములు ఆర్సీబీకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్ ఆర్సీబీకి ఎంతమాత్రం కలిసి రాలేదు.
సీజన్ ఆరంభంలో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అంతేకాదు ఐపీఎల్‌లో 100 ఓటములను ఎదుర్కొన్న తొలి జట్టుగా ఆర్సీబీ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆర్సీబీ పరువు దక్కించుకోవాలని చూస్తుండగా... రాజస్థాన్ మాత్రం గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలవాలని చూస్తోంది.

RCB vs RR మ్యాచ్ డిటేల్స్
తేదీ: మంగళవారం, ఏప్రిల్ 29, 2019
సమయం: 08:00 PM IST
వేదిక: చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
లైవ్ టెలికాస్ట్: స్టార్ నెట్ వర్క్
ఆన్ లైన్ స్ట్రీమింగ్: హాట్ స్టార్

హెడ్ టు హెడ్ రికార్డు
Total Played: 21
RCB Won: 09
RR Won: 10
N/R: 2

చిన్నస్వామి స్టేడియంలో గణాంకాలు
Total Matches - 53
Matches won batting first - 20
Matches won bowling first - 32
Average 1st Inns scores -170
Average 2nd Inns scores - 150

కీలక ఆటగాళ్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, యజువేంద్ర చాహల్
రాజస్థాన్ రాయల్స్
సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, శ్ర్రేయాస్ గోపాల్

జట్ల వివరాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
పార్ధీవ్ పటేల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ(కెప్టెన్), మొయిన్ అలీ, హెన్రిచ్ క్లాసెన్, మార్కస్ స్టోయినిస్, అక్షదీప్ నాథ్, పవన్ నేగి, డేల్ స్టెయిన్, నవదీప్ షైనీ, మహ్మద్ సిరాజ్, యజువేంద్ర చాహల్
రాజస్థాన్ రాయల్స్
రహానే, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఆస్టన్ టర్నర్, బెన్ స్టోక్స్, రేయాన్ పరాగ్, స్టువర్ట్ బిన్నీ, జోప్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనాద్కత్, ధావల్ కులకర్ణి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications