చిన్నస్వామిలో RCB vs MI: బెంగళూరుతో మ్యాచ్‌కి బుమ్రా దూరమనా?

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోన్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఆదివారం ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా బుమ్రా ఎడమ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

బుమ్రా ఎడమ చేయికి గాయం
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ చివరి బంతికి రిషబ్ పంత్ కొట్టిన షాట్‌ను ఆపే ప్రయత్నం చేయగా బుమ్రా ఎడమ చేయి సహకరించలేదు. దీంతో నొప్పితో తన ఎడమ భుజాన్ని పట్టుకున్న బుమ్రా మైదానంలోనే కప్పుకూలాడు. అంతేకాదు ముంబై ఇన్నింగ్స్‌లో మరో నాలుగు బంతులు మిగిలినా బుమ్రా బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి రాలేదు. దీంతో బుమ్రా గాయంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.
బుమ్రా గాయం గురించి భయపడాల్సిన అవసరం లేదు
అయితే, బుమ్రాకు ఏం కాలేదని, అతని గాయం గురించి భయపడాల్సిన అవసరం లేదని ముంబై ఇండియన్స్ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం బుధవారం జట్టు ఆటగాళ్లతో కలిసి బుమ్రా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నప్పటికీ... బౌలింగ్ ప్రాక్టీస్ మాత్రం చేయలేదు. బుమ్రాకి మరింత విశ్రాంతికావాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
ఆర్సీబీతో మ్యాచ్‌కి బుమ్రా దూరమే!
ఇందులో భాగంగ గురువారం ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌కి బుమ్రా కష్టమేనని తెలుస్తోంది. మరో రెండు నెలల్లో ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ఉన్న నేపథ్యంలో బుమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో అతడికి గురువారం నాటి మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications