
హైదరాబాద్: బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ (48), సూర్యకుమార్ యాదవ్ (38), హార్దిక్ పాండ్యా (32 నాటౌట్), యువరాజ్ సింగ్ (23) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో చాహల్ 4 వికెట్లు తీయగా.... ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంబై ఇండియన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ-క్వింటన్ డీకాక్‌లు అదిరిపోయే శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించిన తర్వాత డీకాక్ ఔటయ్యాడు.
ఆ తర్వాత మరో రోహిత్ శర్మ 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 48 పరుగులు స్కోరు వద్ద ఔటవ్వడంతో తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (38), యువరాజ్ సింగ్‌తో కలిసి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా చాహల్ బౌలింగ్‌లో యువీ కొట్టిన హ్యాట్రిక్ సిక్స్‌లు ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి.
ఆ తర్వాత వీరిద్దరూ 18 పరుగుల వ్యవధిలోనే ఔట్ కావడంతో ముంబై ఇండియన్స్ స్కోరు నెమ్మదించింది. ఈ ఇద్దరినీ చాహాల్ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత చాహల్ వేసిన మరుసటి ఓవర్‌లో పొలార్డ్(5) ఔటయ్యాడు. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
బెంగళూరు బౌలర్లలో చాహల్ 4 వికెట్లు తీయగా.... ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు.