For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వర్షం: పంజాబ్ టార్గెట్ 203

ABD

హైదరాబాద్: చిన్నస్వామి స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ 43 బంతుల్లో 82(3 ఫోర్లు,7 సిక్సర్లు)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవరల్లో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌కు 203 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మ్యాచ్ ఆరంభంలోనే జట్టు స్కోరు 35 పరుగుల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ(13) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్‌తో కలిసి మరో ఓపెనర్ పార్దీవ్ పటేల్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్‌ ప్లేలో ఆర్సీబీ 70 పరుగులు సాధించింది.

ఆ తర్వాత జట్టు స్కోరు 71 పరుగుల వద్ద పార్దీవ్ పటేల్ (43) మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మొయిన్‌ అలీ(4), అక్షదీప్‌ నాథ్‌(3) వికెట్లను వెంట వెంటనే కోల్పోవడంతో ఆర్సీబీ స్కోరులో వేగం తగ్గింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్‌తో కలిసి డివిలియర్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

ఈ క్రమంలోనే డివిలియర్స్ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత డివిలియర్స్ చెలరేగాడు. బౌండరీలే లక్ష్యంగా బ్యాటింగ్‌ కొనసాగించాడు. మరోవైపు స్టోయినిస్‌ నుంచి చక్కటి సహకారం లభించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో ఆర్సీబీ 48 పరుగులు చేసింది.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్:

అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కావడంతో స్వల్ప మార్పులు చేశాయి. పంజాబ్ తుది జట్టులో శామ్ కర్రన్, హర్ప్రీత్ సింగ్ స్థానంలో నికోలస్ పూరన్, అంకిత్ రాజ్‌పుత్‌లకు చోటు కల్పించినట్లు అశ్విన్ చెప్పాడు.

మరోవైపు ఆర్సీబీ భుజం గాయంతో బాధపడుతున్న డేల్ స్టెయిన్ స్థానంలో టిమ్ సౌథీని తుది జట్టులోకి తీసుకున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన పంజాబ్ 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుండగా... ఏడు ఓటములతో ఆర్సీబీ మాత్రం ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.

1
45918

ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆడాల్సిన మిగతా మూడు మ్యాచ్‌లు ఆ జట్టుకు ఎంతో కీలకం కానున్నాయి. దీంతో వరుసగా రెండు మ్యాచులు గెలిచి ఊపుమీదున్న కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌ బరిలో నిలవాలని భావిస్తోంది. మరోవైపు పంబాజ్ సైతం ఈ మ్యాచ్‌లో ఓడితే మిగతా మూడు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.

ఇదిలా ఉంటే, మొయిన్‌ అలీకి ఈ సీజన్‌లో ఇదే చివరి మ్యాచ్‌. ఈ మ్యాచ్ అనంతరం అతడు వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా సొంత దేశానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్ ప్రకటించిన వరల్డ్ కప్ జట్టులో మొయిన్ అలీ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

జట్ల వివరాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

పార్ధీవ్ పటేల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ(కెప్టెన్), మొయిన్ అలీ, మార్కస్ స్టోయినిస్, అక్షదీప్ నాథ్, నవదీప్ షైనీ, టిమ్ సౌథీ, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, ఉమేశ్ యాదవ్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్
కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్, మన్దీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), హర్డుస్ విజయిన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, అంకిత్ రాజ్‌పుత్

Story first published: Wednesday, April 24, 2019, 22:24 [IST]
Other articles published on Apr 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+