ధావన్, శ్రేయస్ అర్ధ శతకాలు.. బెంగళూరు లక్ష్యం 188

డిల్లీ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో డిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. డిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి.. బెంగళూరు ముందు 188 పరుగుల భారీ లక్ష్యంను ఉంచింది. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ పోటీపడి బౌండరీలు బాదడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

ధావన్ అర్ధ శతకం:
అయితే ఉమేశ్ యాదవ్ వేసిన 4వ ఓవర్ మూడో బంతికి పృథ్వీషా (18; 10 బంతుల్లో 4x4) పార్థీవ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అనంతరం శిఖర్ ధావన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లు బాధ్యతాయుతంగా ఆడి ఇనింగ్స్ ను నిర్మించారు. ఈ క్రమంలో ధావన్ 36 బంతుల్లో అర్థ శతకం చేసాడు. ఈ జోడి రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. చాహల్ వేసిన 13వ ఓవర్ రెండో బంతికి ధావన్ 50 (37 బంతుల్లో 5 x4, 2x6) వాషింగ్టన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

శ్రేయస్ అర్ధ శతకం:
అనంతరం శ్రేయస్ అయ్యర్ జోరు పెంచి వేగంగా ఆడాడు. అయితే చాహల్ వేసిన 15వ ఓవర్ ఐదో బంతికి పంత్ (7) ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. ఇదే సమయంలో అయ్యర్ 52 (37 బంతుల్లో 2x4, 3x6) అర్ధ శతకం పూర్తి చేసి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే ఇన్‌గ్రామ్ (11) సుందర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

రూతర్ ఫోర్డ్, అక్షర్ పటేల్ మెరుపులు:
ఇన్నింగ్స్ చివరలో రూతర్ ఫోర్డ్ 28 (13 బంతుల్లో 1x4, 3x6), అక్షర్ పటేల్16 (9 బంతుల్లో 3x4)లు చెలరేగి ఆడారు. ఈ జోడి దాటికి ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో చాహల్ 2.. సైనీ, ఉమేశ్, సుందర్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications