Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

IPL 2019, RCB vs DC: Delhi Capitals have won the toss and have opted to bat

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మరికొద్ది సేపట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు మార్పులతో బెంగళూరు బరిలోకి దిగుతోంది. క్లాసేన్, గురుకీరత్, శివమ్ దుబేలు జట్టులోకి వచ్చారు. మరోవైపు ఢిల్లీ ఒక మార్పు చేసింది. మోరిస్ స్థానంలో సందీప్ తుది జట్టులోకి వచ్చాడు.

టోర్నీలో ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌లాడిన డిల్లీ 7 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. బెంగళూరు 11 మ్యాచ్‌లు ఆడి నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఫ్లేఆఫ్‌కు చేరాలంటే బెంగళూరు ఈ మ్యాచ్‌తో సహా మూడు మ్యాచ్‌లను గెలవాలి, మెరుగైన రన్ రేట్ కూడా ఉండాలి. ఇక ఈ మ్యాచ్‌లో డిల్లీ గెలిస్తే ప్లేఆఫ్‌కు బెర్తు ఖరారు చేసుకుంటుంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌:
పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రూథర్‌ఫర్డ్‌, కొలిన్‌ ఇంగ్రామ్‌, అక్షర్‌ పటేల్‌, రబాడ, సందీప్‌, అమిత్‌ మిశ్రా, ఇషాంత్‌ శర్మ.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు:
పార్థివ్‌ పటేల్‌ (వికెట్‌ కీపర్‌), విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, స్టొయినిస్‌, క్లాసెన్‌, శివమ్‌ దూబే, గురుకీరత్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, నవ్‌దీప్‌ సైనీ, ఉమేష్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌.

Story first published: Sunday, April 28, 2019, 16:04 [IST]
Other articles published on Apr 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+