ఆర్సీబీ వరుస వైఫల్యాలపై స్పందించిన డివిలియర్స్

హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఇంతవరకు గెలుపు రుచి చూడలేదు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం గెలుపు అంచుల వరకు వచ్చి ఓడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో 70 పరుగులకే ఆలౌటైంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

118 పరుగులతో ఓటమి
టోర్నీలోనే అత్యంత బలమైన జట్లలో ఒకటిగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 118 పరుగులతో ఓడిపోవడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ సీజన్‌లో ఆర్సీబీ ముఖ్యంగా అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ అంచనాలను అందుకోలేకపోతుంది.

రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనున్న ఆర్సీబీ
టోర్నీలో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మంగళవారం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌కి జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైఫల్యాలపై ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు.

బస్సులో వెనుక సీట్లో
"సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఓటమి అనంతరం హోటల్‌కు వెళ్లేటప్పుడు నేను, విరాట్ కోహ్లీ బస్సులో వెనుక సీట్లలో కూర్చున్నాం. ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. ఆ సమయంలో మాట్లాడటానికి ఇద్దరికీ మాటలు రాలేదు. కారణం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంత ఘోర పరాజయాన్ని మేము ఊహించలేదు" అని చెప్పాడు.

రెండు వారాల నుంచి
"మేము కోరున్నది ఇది కాదు. గత రెండు వారాల నుంచి మా జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. మా ప్రిపరేషన్ కూడా అద్భుతంగా ఉంది. దీంతో పాటు జట్టు కూడా సమతూకంగా ఉంది. ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయి ఉండొచ్చు. ఇకపై అడే అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తాం. మాపై మాకు నమ్మకం ఉంది" అని డివిలియర్స్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications