తెలివైనవాడు: చాహర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన రోహిత్ శర్మ

హైదరాబాద్: ముంబై ఇండియన్స్ స్పిన్నర్ రాహుల్ చాహర్ చాలా తెలివైనవాడని, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. టోర్నీలో భాగంగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, క్రికెట్ జట్లు తలపడ్డాయి.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఫిరోజ్‌షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహర్ (3/19) అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ "ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేసే విషయంలో చాహర్ ఏదో చేశాడు" అని అన్నాడు.
తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు
"గతేడాది కూడా జట్టులో ఉన్నా... తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఒకానొక దశలో మేం అతనికి అవకాశం కల్పించాం. తాను ఏంచేయాలని అనుకుంటాడో దానిని కరెక్టుగా అమలు చేస్తాడు. తన వ్యూహాన్ని అమలు పరచడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తాడు. అది చాలా మంచిది" అని రోహిత్ శర్మ అన్నాడు.
ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్‌కు
"ఇక, ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేసేటప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. కెప్టెన్ అతనిపై నమ్మకం ఉంచితే చాలు. మొదటి రెండు ఓవర్లు ముగిసిన తర్వాత 140 పరుగుల లక్ష్యం సరిపోతుందని భావించాం. క్వింటన్‌తో కూడా అదే చెప్పా. అయితే, చేతిలో వికెట్లు ఉండటంతో డెత్ ఓవర్లలో పరుగులు చేయడానికి మా పవర్ హిట్టర్స్ ఉపయోగించాలనుకున్నాం. మా స్పిన్నర్ల నైపుణ్యం మాకు తెలుసు. మా ప్రణాళికను విజయవంతగా అమలు చేశాం" అని రోహిత్ అన్నాడు.
168 పరుగులు చేసిన ముంబై
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం 169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు పృథ్వీ షా(20), శిఖర్ ధావన్(35) పరుగులతో శుభారంభాన్నిచ్చారు.
40 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ
వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత శిఖర్ ధావన్ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మిగతా బ్యాట్స్‌మన్ మున్రో(3), అయ్యర్(3), పంత్(7) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరడంతో ఢిల్లీ 76 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో ఆక్సర్ పటేల్ 23 బంతుల్లో 26 (ఫోర్, సిక్స్), మోరిస్ (11) పరుగులతో ఫరవాలేదనిపించడంతో ఈ మాత్రం స్కోరన్నా చేయగలిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications