క్రీడాస్ఫూర్తికి విరుద్ధం: బట్లర్ ‘మన్కడింగ్’ రనౌట్‌పై అశ్విన్‌పై తీవ్ర విమర్శలు

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ ఔట్ సరికొత్త వివాదాన్ని రేపింది. రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని 'మన్కడింగ్' ద్వారా రనౌట్ చేయడంపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా జైపూర్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టుని విజయం దిశగా నడిపిస్తున్న జోస్ బట్లర్ (69)ని క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా అశ్విన్ రనౌట్ చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ నిబంధనల ప్రకారం కనీసం ఒక్కసారైనా 'మన్కడింగ్'పై బౌలర్ హెచ్చరించాలి. కానీ, అశ్విన్ అనైతికంగా వ్యవహరించి బట్లర్‌ని ఔట్ చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.
అసలు ఏం జరిగింది?
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం 185 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుని ఓపెనర్ జోస్ బట్లర్ (69: 43 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో మెరుగైన స్థితిలో నిలిపాడు. ఆ జట్టు విజయానికి 48 బంతుల్లో 80 పరుగులు అవసరమైన దశలో అశ్విన్ బౌలింగ్‌కి వచ్చాడు.
అశ్విన్ బంతి వేయబోయే సమయానికే
అశ్విన్ బంతి వేయబోయే సమయానికే బట్లర్ క్రీజ్ వదిలి కాస్త ముందుకు వచ్చాడు. ఇదే అదనుగా బౌలింగ్‌ని నిలిపివేసిన అశ్విన్ వెనక్కి వచ్చి బెయిల్స్ అప్పీల్ చేశాడు. ఆఖరి క్షణంలో బౌలింగ్‌ని నిలిపివేసి రనౌట్‌కి ప్రయత్నించడం నైతికత కాదని.. జోస్ బట్లర్‌తో సహా మ్యాచ్ కామెంటేటర్లు సైతం అభిప్రాయపడ్డారు.
థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్‌గానే
అయితే, థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్‌గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది. కానీ.. అశ్విన్ అనైతికతంగా వ్యవహరించాడని కాసేపు మైదానంలో గొడవచేసిన బట్లర్.. తిట్టుకుంటూనే పెవిలియన్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది.
నిబంధనల (రూల్ 41.16) ప్రకారం
నిబంధనల (రూల్ 41.16) ప్రకారం థర్డ్ అంపైర్ తీసుకుంది సరైన నిర్ణయమే. కానీ, సుదీర్ఘ కెరీర్‌లో ‘జెంటిల్‌మన్'గా గుర్తింపు ఉన్న అశ్విన్... ఎలాగైనా వికెట్ తీయాలనే ప్రయత్నంలో ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరచింది. బంతిని వేసేందుకు ముందుకు వచ్చిన అశ్విన్ భుజాల వరకు చేతిని తెచ్చి అర క్షణం ఆగినట్లు రీప్లేలో కనిపించింది. బట్లర్ క్రీజ్ దాటేవరకు కావాలనే అతను వేచి చూసినట్లు అనిపించింది. ఇప్పుడు ఇది తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications