Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2019 Qualifier 2 CSK vs DC: కొత్త ఛాంపియన్‌ అవతరించేనా?

IPL 2019 : Can Delhi Capitals Continue Their Dream Run Against Chennai Super Kings ? || Oneindia
IPL 2019 Qualifier 2 CSK vs DC Preview: Can Delhi continue their dream run?

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడే జట్టు ఏదో తెలిసిపోతుంది. పాత విజేతే మళ్లీ ట్రోఫీని ముద్దాడుతుందా? లేక క్రికెట్ అభిమానులు కొత్త చాంపియన్‌ను చూస్తారా తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ జోరుమీదుంటే.. సొంతగడ్డపై క్వాలిఫయర్-1లో ముంబై చేతిలో ఓడిన చెన్నై... లీగ్‌లో టాప్‌-2 స్థానంతో ఫినిష్ చేయడంతో ఫైనల్‌ కోసం ఆడేందుకు మరో అవకాశం లభించింది. బలమైన బౌలింగ్‌కు ధోనీ వ్యూహాలు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అదనపు బలం.

రికీ పాంటింగ్ కోచింగ్, సౌరభ్ గంగూలీ సలహాలతో తొలిసారి ఓ నాకౌట్ మ్యాచ్ నెగ్గిన ఢిల్లీ క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో కూడా విజయం సాధించి కొత్త చరిత్రను సృష్టిస్తుందో లేక కెప్టెన్ కూల్ ధోని ప్లాన్స్‌కు చిత్తవుతుందో చూడాలి మరి.

హెడ్ టు హెడ్ రికార్డు

హెడ్ టు హెడ్ రికార్డు

ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీపై చెన్నై సూపర్ కింగ్స్ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... ఢిల్లీ కేవలం 6 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. అంతేకాదు సీఎస్‌కే ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీని నెగ్గగా... ఢిల్లీ ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేదు. ఇక, ఈ సీజన్‌లో గ్రూప్ స్టేజిలో తలపడిన రెండు సార్లు ఢిల్లీపై సీఎస్‌కేనే విజయం సాధించడం విశేషం.

కీలకపాత్ర పోషించిది వీళ్లే

కీలకపాత్ర పోషించిది వీళ్లే

మహేంద్ర సింగ్ ధోని: ఈ సీజన్‌లో ధోని అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఈ సీజన్‌లో చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 13 మ్యాచ్‌ల్లో 405 పరుగులు చేసిన ధోని యావరేజి 135 కావడం విశేషం. చెన్నై ఫైనల్‌ చేరాలంటే ధోని ఈ మ్యాచ్‌లో కూడా రాణించాలి.

రిషబ్‌ పంత్‌: ఈ సీజన్‌లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఎలిమినేటర్‌లో మెరుపు బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌పై ఢిల్లీని గెలిపించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లాడిన రిషబ్ పంత్ 450 పరుగులు చేశాడు.

ధోని అనుభవమే చెన్నై బలం

ధోని అనుభవమే చెన్నై బలం

ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌ను మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. క్వాలిఫయర్‌-1లో ముంబై చేతిలో ఓడిన సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో రాణించాలని భావిస్తోంది. ఓపెనర్ షేన్ వాట్సన్ చెన్నైకి ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్‌ 23న సన్‌రైజర్స్‌పై 53 బంతుల్లో 96 పరుగులు చేసిన తర్వాత.. వాట్సన్‌ మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు. ఇక, బౌలింగ్ విషయానికి వస్తే తాహిర్‌, హర్భజన్‌, జడేజాలతో కూడిన నాణ్యమైన స్పిన్‌ బౌలింగ్‌ ఆ జట్టు సొంతం.

ఢిల్లీ విజయాల్లో ఓపెనర్లు కీలకం

ఢిల్లీ విజయాల్లో ఓపెనర్లు కీలకం

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఎవరో ఒకరు రాణించడంతో ఈ సీజన్‌లో ఆ జట్టు విజయాలను నమోదు చేస్తోంది. యవ ఓపెనర్ పృథ్వీ షాతో కలిసి సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టుకు మంచి శుభారంభాలను అందిస్తున్నాడు. మిడిలార్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మున్రో రూపంలో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పంత్ మరోసారి చెలరేగితే చెన్నైకి కష్టాలే. ఇక, బౌలింగ్ విషయానికి వస్తే సఫారీ పేసర్ కగిసో రబాడ ఈ మ్యాచ్‌కి దూరం కావడం... కొంత ఇబ్బందిని కలిగిస్తోంది. వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అనుభవానికి తోడు... అక్షర్ బౌలింగ్, బ్యాటింగ్, పీల్డింగ్‌లో జట్టుకు ఉపయోగపడుతున్నాడు.

జట్ల వివరాలు

జట్ల వివరాలు

చెన్నై సూపర్ కింగ్స్

షేన్ వాట్సన్, డుప్లెసిస్, మురళీ విజయ్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్

ఢిల్లీ క్యాపిటల్స్

శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కొలిన్ మున్రో, రూథర్‌ఫర్డ్, అక్షర పటేల్, కీమో పాల్, అమిత్ మిశ్రా, ట్రెంట్ బౌల్ట్, ఇషాంత్ శర్మ

Story first published: Friday, May 10, 2019, 11:34 [IST]
Other articles published on May 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+