ఐపీఎల్ 2019, క్వాలిఫయిర్ 2: హెడ్ టు హెడ్ రికార్డులివే!

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. శుక్రవారం జరగనున్న ఈ మ్యాచ్‌కి విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై ఓడగా... ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఇక, గ్రూప్ స్టేజిలో ఇరు జట్లు తొమ్మిది మ్యాచ్‌ల్లో నెగ్గగా... ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. అయితే, మెరుగైన నెట్ రన్‌రేట్‌ని కలిగి ఉండటంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవగా... ఢిల్లీ క్యాపిటల్స్ మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఇప్పుడు క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో చెన్నైతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను ఒక్కసారి పరిశీలిస్తే....

హెడ్ టు హెడ్ రికార్డు
ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీపై చెన్నై సూపర్ కింగ్స్ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... ఢిల్లీ కేవలం 6 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. అంతేకాదు సీఎస్‌కే ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీని నెగ్గగా... ఢిల్లీ ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేదు. ఇక, ఈ సీజన్‌లో గ్రూప్ స్టేజిలో తలపడిన రెండు సార్లు ఢిల్లీపై సీఎస్‌కేనే విజయం సాధించడం విశేషం.

సీఎస్‌కే ఓపెనర్లు రాణించాలి
ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్ పూర్తిగా నిరాశపరిచింది. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా సీఎస్‌కే ఓపెనర్ షేన్ వాట్సన్ అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో షేన్ వాట్సన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు మంచి భాగస్వామ్యాన్ని జోడిస్తేనే భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లోనూ బరిలో దిగే అవకాశం ఉంది.

ఎలిమినేటర్ మ్యాచ్ జోష్‌తో బరిలోకి ఢిల్లీ
ఇక, ఢిల్లీ విషయానికి వస్తే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై విజయం సాధించి మంచి ఊపు మీదుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో క్రిస్ మోరిస్ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న కీమో పాల్ మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది.

జట్ల వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్
షేన్ వాట్సన్, డుప్లెసిస్, మురళీ విజయ్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్
ఢిల్లీ క్యాపిటల్స్
శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కొలిన్ మున్రో, రూథర్‌ఫర్డ్, అక్షర పటేల్, కీమో పాల్, అమిత్ మిశ్రా, ట్రెంట్ బౌల్ట్, ఇషాంత్ శర్మ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications