న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Qualifier 2, CSK vs DC: టాస్ నెగ్గిన ధోని, ఢిల్లీ బ్యాటింగ్

IPL 2019: Qualifier 2, CSK vs DC: Chennai Super Kings win the toss and elect to field

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరుగుతున్న క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. మురళీ విజయ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు ధోని తుది జట్టులో చోటు కల్పించాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఆదివారం హైదరాబాద్ వేదికగా జరిగే ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది. పాత విజేతే మళ్లీ ట్రోఫీని ముద్దాడుతుందా? లేక క్రికెట్ అభిమానులు కొత్త చాంపియన్‌ను చూస్తారా? అనే విషయం ఈ మ్యాచ్‌తో తెలిసిపోతుంది.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ జోరుమీదుంటే.. సొంతగడ్డపై క్వాలిఫయర్-1లో ముంబై చేతిలో ఓడిన చెన్నై... లీగ్‌లో టాప్‌-2 స్థానంతో ఫినిష్ చేయడంతో ఫైనల్‌ కోసం ఆడేందుకు మరో అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లో ధోని వ్యూహాలే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అదనపు బలం.

మరోవైపు రికీ పాంటింగ్ కోచింగ్, సౌరభ్ గంగూలీ సలహాలతో తొలిసారి ఓ నాకౌట్ మ్యాచ్ నెగ్గిన ఢిల్లీ క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో కూడా విజయం సాధించి కొత్త చరిత్రను సృష్టిస్తుందో లేక కెప్టెన్ కూల్ ధోని ప్లాన్స్‌కు చిత్తవుతుందో చూడాలి మరి. కాగా, ఐపీఎల్‌లో ఢిల్లీపై చెన్నై సూపర్ కింగ్స్ మెరుగైన రికార్డుని కలిగి ఉంది.

1
45948

ఇప్పటివరకు ఈ రెండు జట్లు 20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... ఢిల్లీ కేవలం 6 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. అంతేకాదు సీఎస్‌కే ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీని నెగ్గగా... ఢిల్లీ ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేదు. ఇక, ఈ సీజన్‌లో గ్రూప్ స్టేజిలో తలపడిన రెండు సార్లు ఢిల్లీపై సీఎస్‌కేనే విజయం సాధించింది.


జట్ల వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్
డుప్లెసిస్‌, షేన్‌ వాట్సన్‌, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, ధోనీ, డ్వేన్‌ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌

ఢిల్లీ క్యాపిటల్స్
శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కొలిన్ మున్రో, రూథర్‌ఫర్డ్, అక్షర పటేల్, కీమో పాల్, అమిత్ మిశ్రా, ట్రెంట్ బౌల్ట్, ఇషాంత్ శర్మ

Story first published: Friday, May 10, 2019, 19:24 [IST]
Other articles published on May 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X