For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Qualifier 2, CSK vs DC: చెన్నై విజయ లక్ష్యం 148

Panth

హైదరాబాద్: విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో యువ ఆటగాడు రిషబ్ పంత్ 25బంతుల్లో 38(2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు 148 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ మ్యాచ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 21 పరుగుల వద్ద ఓపెనర్ పృథ్వీషా (5) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (18) జట్టు స్కోరు 37 పరుగుల వద్ద భజ్జీ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత సీఎస్‌కే బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టారు.

కోలిన్‌ మున్రో(27) కూడా ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. దీంతో 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో రిషభ్ పంత్ ఒక్కడే ఫరవాలేదనిపించాడు. 25 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 38 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్‌లో డ్వేన్ బ్రావోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

చివరల్లో ఇషాంత్ శర్మ సిక్సర్, ఫోర్‌తో పది పరుగులు చేయడంతో ఢిల్లీ 147 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, జడేజా, బ్రావో రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టగా ఇమ్రాన్ తాహిర్ ఓ వికెట్ తీశాడు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై
అంతకముందు టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. మురళీ విజయ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు ధోని తుది జట్టులో చోటు కల్పించాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఆదివారం హైదరాబాద్ వేదికగా జరిగే ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది. పాత విజేతే మళ్లీ ట్రోఫీని ముద్దాడుతుందా? లేక క్రికెట్ అభిమానులు కొత్త చాంపియన్‌ను చూస్తారా? అనే విషయం ఈ మ్యాచ్‌తో తెలిసిపోతుంది.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ జోరుమీదుంటే.. సొంతగడ్డపై క్వాలిఫయర్-1లో ముంబై చేతిలో ఓడిన చెన్నై... లీగ్‌లో టాప్‌-2 స్థానంతో ఫినిష్ చేయడంతో ఫైనల్‌ కోసం ఆడేందుకు మరో అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లో ధోని వ్యూహాలే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అదనపు బలం.

1
45948

మరోవైపు రికీ పాంటింగ్ కోచింగ్, సౌరభ్ గంగూలీ సలహాలతో తొలిసారి ఓ నాకౌట్ మ్యాచ్ నెగ్గిన ఢిల్లీ క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో కూడా విజయం సాధించి కొత్త చరిత్రను సృష్టిస్తుందో లేక కెప్టెన్ కూల్ ధోని ప్లాన్స్‌కు చిత్తవుతుందో చూడాలి మరి. కాగా, ఐపీఎల్‌లో ఢిల్లీపై చెన్నై సూపర్ కింగ్స్ మెరుగైన రికార్డుని కలిగి ఉంది.

ఇప్పటివరకు ఈ రెండు జట్లు 20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... ఢిల్లీ కేవలం 6 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. అంతేకాదు సీఎస్‌కే ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీని నెగ్గగా... ఢిల్లీ ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేదు. ఇక, ఈ సీజన్‌లో గ్రూప్ స్టేజిలో తలపడిన రెండు సార్లు ఢిల్లీపై సీఎస్‌కేనే విజయం సాధించింది.


జట్ల వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్

డుప్లెసిస్‌, షేన్‌ వాట్సన్‌, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, ధోనీ, డ్వేన్‌ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌

ఢిల్లీ క్యాపిటల్స్
పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌అయ్యర్‌, రిషభ్‌పంత్‌, కొలిన్‌ మన్రో, అక్షర్‌పటేల్‌, రూథర్‌ఫర్డ్‌, కీమో పాల్‌, అమిత్‌ మిశ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌, ఇషాంత్‌ శర్మ

Story first published: Friday, May 10, 2019, 21:46 [IST]
Other articles published on May 10, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+